Dangerous App: దొంగ యాప్.. ఇన్ స్టాల్ చేశారో అంతే సంగతులు.. డేటా మొత్తం హాం ఫట్..

ఈ హానికరమైన యాప్ ను డిఫాల్ట్ యాప్ గా సెట్ చేసుకోవాలని వినియోగదారులను ఒప్పించేందుకు సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్ లను హాకర్లు వినియోగిస్తున్నారు. చట్టబద్ధమైన యాప్ మాదిరిగానే మెసేజ్ లు పంపిస్తారు. తద్వారా వినియోగదారులను నమ్మించి దీనిని డౌన్ లోడ్ చేసుకునేలా చేస్తారు. అది డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తే ఇక మన డేటా మొత్తం వారు చోరీ చేస్తారు.

Dangerous App: దొంగ యాప్.. ఇన్ స్టాల్ చేశారో అంతే సంగతులు.. డేటా మొత్తం హాం ఫట్..
Phone Malware

Updated on: Feb 29, 2024 | 9:22 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు ద ర్శనమిస్తున్నాయి. అవి లేనిదో రోజు గడవని పరిస్థితి. ఆ ఫోన్లలో రకరకాల యాప్ లను మనం ఇన్ స్టాల్ చేసుకుంటాం. ఇటీవల కాలంలో అన్ని సేవలు యాప్ ల ద్వారానే లభిస్తున్నాయి. దీంతో అనివార్యంగా యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే అన్ని యాప్ లు మంచివి కావు. మనకు నష్టం కలిగించేవి కూడా ఉంటాయి. అటువంటి ఒక యాప్ ను ఇటీవల గుర్తించారు. దీనిని మనం ఇన్ స్టాల్ చేసుకోగానే వ్యక్తిగత ఫొటోలు, డేటా, చాటింగ్ వివరాలను దొంగిలిస్తుంది.

డేటా చోరీ..

మెకాఫీ పరిశోధన సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా ఆండ్రాయిడ్ పరికరంలో ఇన్ స్టాల్ చేసిన తర్వాత పొటోలు, పాస్ వర్డ్ లు, చాట్ లు, వినియోగదారుల డేటాను ఆటోమేటిక్ గా దొంగిలించే మాల్వేర్ ను హాకర్లు రూపొందించారు. దీనిని MoqHao కొత్త రూపాంతరం wroba and xloader అని కూడా పిలుస్తారు. MoqHao ఈ కొత్త ప్రమాదకర వేరియంట్ ను ఎస్ఎమ్ఎస్ లింక్ ల ద్వారా వినియోగదారులకు స్ప్రెడ్ చేస్తోంది.

క్రోమ్ రూపంలో..

హాకర్లు ఒక ప్రమాదకరమైన యాప్ ను రూపొందిస్తారు. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎస్ ఎమ్ ఎస్ లింక్ పంపిస్తారు. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ప్రారంభించగానే , దాని పనిని ప్రారంభిస్తుంది. ఈ మాల్వేర్ క్రోమ్ రూపంలో ఉంటుంది. డౌన్ లోడ్ చేసిన తర్వాత హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్ తదితర భాషల్లో డిఫాల్ట్ ఎస్ ఎమ్ ఎస్ గా తనను సెట్ చేసుకోవాలని అభ్యర్తిస్తుంది. అయితే టెస్ట్ లో కనిపించిన భాషలను పరిశీలిస్తే జపాన్, సౌత్ కొరియా, ఫ్రా న్స్, జర్మనీ, భారత దేశాలను హాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

హానికరం..

ఈ హానికరమైన యాప్ ను డిఫాల్ట్ యాప్ గా సెట్ చేసుకోవాలని వినియోగదారులను ఒప్పించేందుకు సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్ లను హాకర్లు వినియోగిస్తున్నారు. చట్టబద్ధమైన యాప్ మాదిరిగానే మెసేజ్ లు పంపిస్తారు. తద్వారా వినియోగదారులను నమ్మించి దీనిని డౌన్ లోడ్ చేసుకునేలా చేస్తారు. అది డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తే ఇక మన డేటా మొత్తం వారు చోరీ చేస్తారు.

క్లిక్ చేస్తే అనర్థమే..

ఈ యాప్ ఇటాలిక్ ’ r ‘ ను కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేయాలని అడుగుతుంది. అప్పుడు దానిని మాల్వేర్ నిండిన క్రోమ్ యాప్ గా గుర్తించాలి. అటువంటి వాటిని క్లిక్ చేస్తే మనం సమాచారమంతా నేరగాళ్ల బారిన పడుతుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఇటువంటి ఆటో ఎగ్జిక్యూషన్ ను నిరోధించడానికి మెకాఫీ కంపెనీ కొత్త సాంకేతికతను గూగుల్ కు నివేదించింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతోంది.

సాధారణంగా గూగుల్ క్రోమ్ ఇటువంటి అనుమతి అడగదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్ యాప్ అందుబాటులో ఉంది. వినియోగదారులు దీని నుంచే అన్ని రకాల యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us