Gmail
సాధారణంగా స్పామ్ కాల్స్, మెసేజ్ ల గురించి మనకు బాగా తెలుసు. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు, ఏదైనా అత్యవసరంగా వెళ్తున్నప్పుడు ఈ స్పామ్ కాల్స్ వచ్చి చాలా ఇరిటేషన్ ను క్రియేట్ చేస్తాయి. అయితే ఫోన్ లో వాటిని డీఎన్డీ యాక్టివేట్ చేయడం ద్వారా ఆపివేయొచ్చు. అలాగే జీ మెయిల్ లో స్పామ్ మెయిల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. జీమెయిల్ ఎక్కువగా వాడే వారికి ఈ స్పామ్ మెయిల్స్ చాలా చిరాకు పెడతాయి. వీటి కారణంగా అప్పుడప్పుడు ముఖ్యమైన మెయిల్స్ కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. కొన్ని స్కామ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి. మనం పొరపాటున దానిని క్లిక్ చేస్తే మన వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాక్ ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్పామ్ మెయిల్స్ ఆట కట్టించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ఒక్కొక్కటీ చేయడం కష్టం..
ప్రతి రోజు సగటున నాలుగు నుంచి ఐదు స్పామ్ మెయిల్స్ మీ జీమెయిల్ ఖాతాకు వస్తుంటాయి. అటువంటి వాటిని గుర్తించి ఒక్కొక్కటీగా డిలీట్ చేయడం కష్టం. పోనీ డిలీట్ చేయకుండా వదిలేద్దాం అంటే జీ మెయిల్ స్పేస్ వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి సమయాల్లోనే కొన్ని టిప్స్ మనకు ఉపకరిస్తాయి. అవేంటంటే.. స్పామ్ మెయిల్ సెండర్ ను మనం బ్లాక్ చేయొచ్చు.. లేదా అన్ సబ్ స్రైబ్ చేయొచ్చు.. లేదా ఫిల్టర్ చేయవచ్చు.. అదీ లేదంటే మొత్తం అన్ని మెసేజ్ లను కలిపి బల్క్ గా డిలీట్ చేయొచ్చు. అవి ఎలా చేయాలో చూద్దాం..
బ్లాక్ చేయడం ఇలా..
- జీమెయిల్ ఓపెన్ చేసి, మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న స్పామ్ మెయిల్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఆ మెయిల్ టాప్ లో కుడి చేతి వైపు ఉన్న మోర్ అనే బటన్ ప్రెస్ చేయండి.
- వచ్చిన ఆప్షన్ల నుంచి బ్లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ చేయండి. భవిష్యత్తులో ఆ మెయిల్ సెండర్ నుంచి మీకు ఎటువంటి మెయిల్స్ కూడా రాదు. అలాగే ఆ సెండర్ నుంచి వచ్చిన మెయిల్స్ కూడా స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్లిపోతాయి.
- ఒకవేళ పొరపాటున సెండర్ ని బ్లాక్ చేసినా వెంటనే అన్ బ్లాక్ చేసుకొనే వెసులుబాటు ఉంది.
అన్ సబ్ స్రైబ్ చేయడం ఎలా..
- జీమెయిల్ ఓపెన్ చేసి, మీరు అన్ సబ్ స్రైబ్ చేయాలనుకొంటున్న సెండర్ మెయిల్ సెలెక్ట్ చేయాలి.
- ఆ సెండర్ పేరు పక్కన కనిపిస్తున్న అన్ సబ్ స్రైబ్ లేదా చేంజ్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అలాగే ఆ సెండర్ నుంచి వస్తున్న మోసేజ్ లను బ్లాక్ చేయవచ్చు లేదా స్పామ్ లో కలిపేయవచ్చు.
ఫిల్టర్ చేయడం ఇలా..
- జీమెయిల్ ఓపెన్ చేసి అన్ సబ్ స్రైబ్ చేయాల్సిన మెయిల్స్ లను సెర్చ్ చేయాలి.
- ప్రమోషనల్ లిస్ట్ శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న స్పామ్ మెయిల్స్ ను సెలక్ట్ చేసుకోవాలి.
- కుచిచేతి వైపు టాప్ లో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి, ‘ఫిల్టర్ మెసేజెస్ లైక్ థీస్’
అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీరు డిలీట్ ఇట్, మార్క్ స్పామ్, మార్క్ యాజ్ రీడ్, అప్లై లేబ్ అనే ఆప్షన్ల నుంచి మీకు కావాల్సిన దానికి ఎంపిక చేసుకోవచ్చు.
- ఆ తర్వాత ‘క్రియేట్ ఫిల్టర్’పై క్లిక్ చేసి సేవ్ చేయాలి.
బల్స్ మెసేజ్ లను ఎలా డిలీట్ చేయాలి..
- జీ మెయిల్ ను ఓపెన్ చేసి, ఇన్ బాక్స్ సెక్షన్ లో ఎడమచేతి వైపు టాప్ లో కిందికి సూచిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేస్తే అన్ని మెసేజ్ లు సెలెక్ట్ అవుతాయి.
- ఒకవేళ అన్ని పేజీల్లోని మెసేజ్ లు సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ ఆల్ కాన్వర్జేషన్స్ ఎంపిక చేయాలి.
- తర్వాత డిలీట్ పై క్లిక్ చేస్తే ఎంపిక చేసిన మెసేజ్ లన్నీ ట్రాష్ లోకి వెళ్లిపోతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..