Pre-Installed Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త రూల్స్‌తో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లకు చెక్..

|

Mar 15, 2023 | 8:48 AM

స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల గోప్యతతో పాటు డేటా, దేశ భద్రత ప్రయోజనాల మేరకు కంపెనీలకు నూతన రూల్స్ తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈమేరకు ఫ్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను..

Pre-Installed Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. కొత్త రూల్స్‌తో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లకు చెక్..
Smartphones
Follow us on

స్మార్ట్‌ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నానా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. కొత్త ఫోన్‌‌లో పీ ఇన్‌స్టాల్‌గా వచ్చిన యాప్‌లను ఇకపై తొలగించే ఆప్షన్ రానుంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు త్వరలో వినియోగదారులకు ఫ్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించే ఎంపికను అందించేందుకు కూడా కసరత్తులు మొదలైనట్లు తెలుస్తోంది. పీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను బ్లోట్‌వేర్ అంటారు. ఒక నివేదిక ప్రకారం, వినియోగదారుల ప్రైవసీ దుర్వినియోగంపై చాలా ఆందోళనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఐటీ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.

ముఖ్యంగా, పీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించే ఆప్షన్‌ను అందించే మేడ్-ఇన్-ఇండియా భరోస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కూడా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ కొత్త రూల్, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఏజెన్సీ తనిఖీ చేస్తుందని తెలిపింది. ఇది వినియోగదారుల భద్రతకు హామీ ఇస్తుంది.

ఇది ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించే ఎంపికను అందించారా లేదా అని కూడా తనిఖీ చేస్తుంది. కొత్త నిబంధనను తీసుకురావడానికి ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు ఒక సంవత్సరం సమయం ఇవ్వనున్నట్లు కూడా పేర్కొంది. అయితే ఈ నిబంధనను ఎప్పటి నుంచి తీసుకువస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయి. ఈ యాప్‌లు చైనాతో సహా ఏ దేశం కోసం గూఢచర్యం చేయడం లేదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఇది జాతీయ భద్రతా సమస్య. Xiaomi, Samsung, Apple, Vivoతో సహా భారతదేశంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు భావిస్తున్నారు.

ఆదాయానికి గండి..

ఈ నిబంధనను అమలు చేస్తే బ్రాండ్‌ల ఆదాయానికి పెద్ద దెబ్బే అని అంటున్నారు. ఎందుకంటే అనేక ఆండ్రాయిడ్ బ్రాండ్‌లు తమ ఫ్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల కోసం Meta, Snap వంటి కంపెనీలతో కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..