ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఈ నెల 23 నుంచి ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్లకు ఈ సేల్ ఒక రోజు ముందుగానే అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్టు అనేక స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు అందించనుంది. అయితే ఈ సేల్‌లో కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే రివీల్ చేసింది. అందులో ‘గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గనున్నట్టు ఫ్లిప్‌కార్లు పేర్కొంది.
గతేడాది ఆగస్ట్‌లో లాంచ్ అయినప్పుడు గూగుల్ పిక్సెల్ 9 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉండగా. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్ రూ.64,999కి అందుబాటులో ఉంది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్ ధర సగం కంటే తక్కువకే వస్తుంది. అంటే బిగ్ బిలియన్ డే సేల్‌లో రూ.37,999లకే ఫ్లిప్‌కార్టు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీకు అందించనుంది.
అయితే మీకు మరో గుడ్‌న్యూస్ ఏంటంటే.. మీ దగ్గర యాక్సిస్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ ఉంటే మరో రూ.2వేల వరకు మీకు తగ్గుతుంది. అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.1000 తగ్గుతుంది. ఇలా అన్ని ఆఫర్స్ కలుపుకొని చివరకూ మీరు రూ.34,999కు గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్‌ను సొంత చేసుకోవచ్చు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.