Google Work From Home: కరోనా కారణంగా చాలా రంగాలు ప్రభావితమైన విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీతో సంబంధం ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయి. దీంతో ఈ రంగాలపై కరోనా ప్రభావం పెద్దగా పడలేదనే చెప్పాలి. అయితే ఇకపై ఆఫీసులో ఉద్యోగం చేసే వారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఒకేలా జీతభత్యాలు ఉంటాయా? అంటే… కాదనే సమాధానం వస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ తొలి అడుగు వేసింది. ఇకపై పనిచేసే ప్రదేశం ఆధారంగా జీతభత్యాలను నిర్ధారించనున్నారు.
ఇందుకోసం గూగుల్ ఒక సరికొత్త టూల్‌ను తీసుకొచ్చింది. వర్క్ లొకేషన్ పేరుతో పిలుస్తోన్న టూల్ ఆధారంగా.. సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లీవింగ్), లోకల్ జాజ్‌తో పలు అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. వీటి ఆధారంగా ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది ఆ టూల్ లెక్కగట్టి చెబుతుంది. అంతేకాకుండా వారు నివసిస్తోన్న ప్రాంతం ఆధారంగా వారికి ఇంకేం బెనిఫిట్స్ అందించాలనేది ఈ టూల్ నిర్ణయిస్తుంది. ఇక ఉద్యోగులను కూడా ఎక్కడి నుంచి పని చేసుకోవాలనేది.. వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
Stress in Plants: మొక్కే కదా అని తీసిపారేయకండి.. దానికీ ఒత్తిడి ఉంటుందట తెలుసా..?