ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎలక్ట్రానిక్ రంగంలోనూ దూకుడు మీదున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గూగుల్ నుంచి ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ను యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా గూగుల్ పిక్సెల్ సిరీస్‌ను రెండు కొత్త ఫోన్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ల సేల్స్ అక్టోబర్ 13 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లలో ఉన్న ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
గూగుల్ పిక్సెల్ 7 ఫీచర్ల విషయానికొస్తే ఇఉందలో 6.3 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 11 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 4355 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. గూగుల్ టెన్సార్ జీ2 చిప్‌సెట్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 59,999గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్‌తో కూడిన గూగుల్ టెన్సార్ G2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 10.8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 84,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..