Google New Feature: ఇప్పటి వరకు మనం ఫోన్ లలో ఉండే ఫోటోలను, పీడీఎఫ్ ఫైల్స్ ను జూమ్ చేసుకొని చూసుకుంటాం. అయితే టెక్స్ట్ మెసేజ్ లను కూడా జూమ్ చేసుకొని చూసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ఫీచర్ నే తీసుకొచ్చింది గూగుల్. గూగుల్ మెసేజెస్ యాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను జోడించారు. దీంతో ఛాటింగ్ సెక్షన్ లో టెక్స్ట్ ను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకునే వెసులుబాటు కలగనుంది.
సాధారణంగా టెక్స్ట్ సైజు చిన్నగా ఉండడం వల్ల కళ్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇలాంటి ఫీచర్ ను తీసుకురావాలని యూజర్ల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో గూగుల్ ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే.. గూగుల్ మెసెజ్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 8.X కన్నా తక్కువ వెర్షన్ యాప్‌లో ఈ ఫీచర్ పనిచేయదు. ప్లేస్టోర్ నుంచి గూగుల్ మెసేజెస్ యాప్‌ను డౌన్‌చెకోవచ్చు. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ భలే ఉంది కదూ.
Also Read: Realme 5G Phone: రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేయనున్న రియల్‌మీ.. ఎప్పుడంటే?
Poco x3 GT: విడుదలకు ముందే లీకైన పోకో ఎక్స్3 జీటీ ఫీచర్లు..!
RealMe: ఏడువేల రూపాయలకే రియల్ మీ కొత్త బడ్జెట్ ఫోన్..సి 11 (2021)..ఈ ఫోన్ ఎలా ఉంటుందంటే..