Gmail: మీకు జీమెయిల్‌ అకౌంట్ ఉందా.? మీకోసమే ఈ సూపర్‌ ఫీచర్‌, ఇకపై ఆ సమస్యకు చెక్‌..

ఐఫోన్ యూజర్‌లతోపాటు ఆండ్రాయిడ్ యూజర్లు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం వెబ్ జిమెయిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఒక భాష నుంచి సుమారు 100 భాషల్లోకి మీకు వచ్చిన మెయిల్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇతర భాషల్లో ఈమెయిల్ రావడం సర్వ సాధారణమైపోయింది.. కొన్నిసార్లు ఇతర భాషల్లో మెయిల్ రావడం వల్ల సైబర్ ఫ్రాడ్‌లు సైతం సైతం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు స్పానిష్...

Gmail: మీకు జీమెయిల్‌ అకౌంట్ ఉందా.? మీకోసమే ఈ సూపర్‌ ఫీచర్‌, ఇకపై ఆ సమస్యకు చెక్‌..
Gmail New Feature
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Narender Vaitla

Updated on: Aug 21, 2023 | 7:00 PM

జీమెయిల్ యూజర్లకు కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌లో జీమెయిల్‌ యాప్‌ ఉపయోగించే వారికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ కొత్త ఫీచర్‌.? దీనివల్ల ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. జీమెయిల్‌లోని భాషను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ గూగుల్ ప్రకటన చేసింది. మొన్నటి వరకు కేవలం వెబ్ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది.. తాజాగా మొబైల్ యాప్ వర్షన్లోనూ ఈ ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఐఫోన్ యూజర్‌లతోపాటు ఆండ్రాయిడ్ యూజర్లు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం వెబ్ జిమెయిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఒక భాష నుంచి సుమారు 100 భాషల్లోకి మీకు వచ్చిన మెయిల్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇతర భాషల్లో ఈమెయిల్ రావడం సర్వ సాధారణమైపోయింది.. కొన్నిసార్లు ఇతర భాషల్లో మెయిల్ రావడం వల్ల సైబర్ ఫ్రాడ్‌లు సైతం సైతం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక స్పానిష్ భాషలో లక్ష డాలర్లు గెలుచుకున్నట్టు ఒక ఈ మెయిల్ చేస్తారు. టెక్స్ట్ అంతా స్పానిష్ భాషలోనే ఉన్నప్పటికీ అమౌంటు సంఖ్య మాత్రం నెంబర్ల రూపంలో ఉంటుంది. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన లేని వాళ్లు భాష అర్థం కాక వెంటనే క్లిక్‌ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో చాలా మంది డబ్బులు పోగొట్టున్న సంఘటనలు ఉన్నాయి.

ఈ మెయిల్ లో వచ్చే భాషలో ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో గూగుల్ సంస్థ మొబైల్ యాప్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎలాంటి భాషలో ఈమెయిల్ వచ్చినా సరే వెంటనే వాటిని తమకు అనువైన భాష లోకి మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా మోసపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. మెయిల్ వచ్చిన భాష మనకు అర్థం కాకపోతే వెంటనే ట్రాన్స్‌లేట్‌ ఆప్షన్ ద్వారా మనకు నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే..

* ముందుగా జీమెయిల్‌ యాప్‌ని ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి.

* ఈమెయిల్‌ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న మూడు డాట్ బటన్‌ని చేయాలి.

*అందులో ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి.

* మనకు కావాల్సిన భాషను సెలెక్ట్ చేసుకోవాలి

* సెలక్ట్ చేసుకున్న భాషలోకి ట్రాన్స్‌లేట్‌ అయిన మెయిల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..