Aadhaar Card: ఒరిజినల్ ఆధార్ కార్డు పోయిందా? కొత్త పీవీసీ కార్డు పొందొచ్చు.. ఇలా సింపుల్‌గా దరఖాస్తు చేసుకోండి..
ఆధార్ కార్డు.. మనదేశంలో అత్యంత ప్రధానమైన గుర్తింపు పత్రం. ఇక్కడ ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకుల దగ్గర నుంచి సిమ్ కార్డులు, ఇన్సురెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాలు ఇలా అన్నింటికి ఆధారం ఆధారే. ఇంత ప్రాధాన్యత ఉన్న కార్డును పోగొట్టుకుంటే ఎలా? డూప్లికేట్ ఉన్నప్పటికీ, ఒరిజినల్ ఒరిజినలే కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? తిరిగి మీరు పీవీసీ కార్డును తీసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు.. మనదేశంలో అత్యంత ప్రధానమైన గుర్తింపు పత్రం. ఇక్కడ ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకుల దగ్గర నుంచి సిమ్ కార్డులు, ఇన్సురెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ పథకాలు ఇలా అన్నింటికి ఆధారం ఆధారే. ఇంత ప్రాధాన్యత ఉన్న కార్డును పోగొట్టుకుంటే ఎలా? డూప్లికేట్ ఉన్నప్పటికీ, ఒరిజినల్ ఒరిజినలే కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? తిరిగి మీరు పీవీసీ కార్డును తీసుకోవచ్చు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త పీవీసీ ఆధార్ కార్డును పొందవచ్చు. ఆధార్ కార్డు రీ ప్రింట్ సర్వీస్ ను ఎలా వినియోగించుకోవాలో స్టెప్ బై స్టెప్ విధానంలో తెలుసుకుందాం..
ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు..
మీరు పొగొట్టుకున్న ఒరిజినల్ ఆధార్ కార్డులను తిరిగి పొందేందుకు ఆధార్ కార్డులను ఇష్యూ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ప్రత్యేకమైన సర్వీస్ ను ప్రారంభించింది. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే స్వరీస్ ద్వారా కొత్త పీవీసీ కార్డును మీరు తీసుకోవచ్చు అది కూడా కేవలం రూ. 50 నామినల్ చార్జ్ తోనే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేయకపోయినా మీరు ఈ సర్వీస్ ను వినియోగించుకోవచ్చు. అందు కోసం నాన్ రిజిస్టర్డ్/ అల్టర్నేట్ మొబైల్ ఫీచర్ ను వినియోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..
- యూఐడీఏఐ అధికారికి వెబ్ సైట్ లోకి వెళ్లి మైఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేసి, దానిలో జెనెరిక్ పీవీసీ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- తర్వాత మీ 12 అంకెలతోకూడిన ఆధార్ నంబర్(యూఐడీ)ని ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ కూడా నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీరు ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ ను లింక్ చేసి ఉంటే వెంటనే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి.
- ఒకవేళ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే మై మొబలై ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి.
- మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి,టెర్మ్స్ అండ్ కండీషన్స్ కు సంబంధించిన చెక్ బాక్స్ లో క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి.
- మీ ఆధార్ కార్డు వివరాలతో కూడిన ప్రీవ్యూ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ వివరాలు సరిచూసుకొని రీ ప్రింట్ కి ఆర్డర్ ఇవ్వాలి.
- ఆ తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మరో కొత్త పేజీ మీకు ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్ వే లో పలు రకాల పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. క్రెడిట్/డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ను ఎంపకి చేసుకొని పేమెంట్ పూర్తి చేయాలి.
- ఆ వెంటనే మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకొని పీడీఎఫ్ లో సేవ్ చేసుకోవాలి.
దీంతో ఆధార్ కార్డు ఆర్డర్ ప్లే అవుతుంది. మీ ఇచ్చిన ఫోన్ నంబర్ కి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. దాని ద్వారా మీరు కార్డును బదిలీని ట్రాక్ చేయొచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్లో చెక్ ఆధార్ కార్డు స్టేటస్ ద్వారా డెలివరీ స్టేటస్ ను తనిఖీ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..