
Nothing Phone 3a Lite: కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇక పండుగలు, ప్రత్యేక సేల్స్ సమయంలో భారీ తగ్గింపులు ఆఫర్ చేస్తూ ఉంటాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. నధింగ్ 3A లైట్ హోడల్ ఫోన్ ఇండియాలో ఇప్పటికే లాంచ్ అయింది. డిసెంబర్ 5 నుంచి దీని సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి నథింగ్ కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. కొంతమంది లక్కీ కస్టమర్లకు ఫోన్‌తో పాటు రూ.17,999 విలువైన ఇయర్ ఓపెన్ ఇయర్ బడ్స్ ఫ్రీగా అందిస్తామని స్పష్టం చేసింది.
నవంబర్ 29న ఢిల్లీలోని బ్లూ టోకే కాఫీ రోస్టర్‌లో GK2 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనవారు వచ్చే నెలలో అమ్మకానికి రానున్న నధింగ్ 3A లైట్ ఫోన్‌ను ముందుగానే కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు చేసిన మొదటి 20 మంది కొనుగోలుదారులకు రూ.17,999 విలువైన ఇయర్ ఓపెన్ ఇయర్ బడ్స్‌ను ఉచితంగా అందిస్తారు. నథింగ్ ఫోన్ బేసిక్ వేరియెంట్ ధర రూ.20,999గా ఉండగా.. బ్యాంక్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. దాదాపు బ్యాంకు ఆఫర్లతో రూ.వెయ్యి తగ్గింపు లభిస్తుంది.
మొత్తం 3 వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. 8GB/128GB వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇక 8GB/256GB వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించారు. బ్యాంకు ఆఫర్లపై రూ.వెయ్యి తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 5000 mAh బ్యాటరీ సామర్థ్యంలో IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50MP + 8MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.