Second Hand Laptop: సెకండ్‌ హ్యాండ్ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ లేనిది పని జరిగే పనిలేదు. ప్రతీ ఒక్క రంగంలో పర్సనల్ కంప్యూటర్‌ అనివార్యంగా మారింది. అంతేనా కరోనా పుణ్యామాని ఆన్‌లైన్‌ తరగతులతో చిన్నారులు కూడా ల్యాప్‌టాప్‌లోనే తరగతులు వినే రోజులు వచ్చాయి. దీంతో చాలా మంది ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో సెకండ్‌ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లకు కూడా గిరాకీ భారీగా పెరుగుతోంది...

Second Hand Laptop: సెకండ్‌ హ్యాండ్ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Second Hand Laptop

Updated on: Apr 05, 2024 | 5:07 PM

ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ లేనిది పని జరిగే పనిలేదు. ప్రతీ ఒక్క రంగంలో పర్సనల్ కంప్యూటర్‌ అనివార్యంగా మారింది. అంతేనా కరోనా పుణ్యామాని ఆన్‌లైన్‌ తరగతులతో చిన్నారులు కూడా ల్యాప్‌టాప్‌లోనే తరగతులు వినే రోజులు వచ్చాయి. దీంతో చాలా మంది ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో సెకండ్‌ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లకు కూడా గిరాకీ భారీగా పెరుగుతోంది. అయితే సెకాండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సెకండ్ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

* తక్కువ ధరకు లభిస్తుంది కదా అని ఏది పడితే అది కొనుగోలు చేయకూడదు. మీ అవసరాలకు అనుగుణంగా మీ ల్యాప్‌టాప్‌ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్, గేమింగ్ వంటి వాటి కోసం ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ర్యామ్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ కాన్ఫిగ్రేషన్‌ తీసుకుంటే తర్వాత బాధపడాల్సి ఉంటుంది.

* ఇక సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసే సమయంలో ల్యాప్‌టాప్‌ కండిషన్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ల్యాప్‌టాప్‌పై ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా.? స్క్రీన్‌పై ఏవైనా డ్యామేజ్‌ అయ్యిందా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బ్యాటరీలు అస్సలు బ్యాకప్‌ ఇవ్వవు అలాంటి వాటితో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇక మౌస్‌ ప్యాడ్ కూడా ఎలా పనిచేస్తుందో ముందే చెక్‌ చేసుకోవాలి.

* ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రాసెసర్, ర్యామ్‌, స్టోరేజ్‌లు మీ అవసరాలకు అనుగుణంగా ఉందా లేదా అన్ని విషయాన్ని గమనించాలి. మీరు ఎక్కువ డేటా స్టోర్‌ చేసేందుకు ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటే మాత్రం స్టోరేజ్‌ ఎక్కువగా ఉండే ల్యాప్‌టాప్‌కు మొగ్గు చూపాలి.

* ఇక సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ను ఓఎల్‌ఎక్స్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల్లో కొనుగోలు చేస్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. బ్రాండెండ్‌ ల్యాప్‌టాప్స్‌ పేరుతో లో క్వాలిటీ ల్యాప్‌టాప్‌లను కూడా అమ్ముతుంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని దొంగతనం చేసిన ల్యాప్‌టాప్స్‌ను కూడా సేల్ చేస్తుంటారు. ఇలాంటివి కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..