AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fog: చలి కాలంలో ఉదయం పూట పొగ మంచి ఎందుకు ఉంటుంది..? కారణాలు ఏమిటి?

చలికాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు సమస్య కూడా వేగంగా పెరుగుతుంది. పొగమంచు కారణంగా హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. పలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది..

Fog: చలి కాలంలో ఉదయం పూట పొగ మంచి ఎందుకు ఉంటుంది..? కారణాలు ఏమిటి?
Fog
Subhash Goud
|

Updated on: Oct 30, 2022 | 7:00 AM

Share

చలికాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు సమస్య కూడా వేగంగా పెరుగుతుంది. పొగమంచు కారణంగా హైవేపై వాహనాల వేగం తగ్గుతుంది. పలు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రైళ్లు, విమానాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తాయి. అయితే ఇలా పొగమంచు అనేది ఢిల్లీలో ఎక్కువగా ఉంటుంది. ఈ పొగమంచు ఉదయం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఎందుకు ఉంటుంది.. శీతాకాలంలో పొగమంచు కమ్ముకోవడం ఎందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇలాంటి పరిస్థితిలో పొగమంచుకు సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకోండి.

పొగమంచు అనేది ఒక రకమైన నీటి ఆవిరి. పొగమంచు సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా గమనించవచ్చు. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత అంటారు. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం. అంతవరకూ గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. అదే పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో ఉంటుంది.

పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము.

ఇవి కూడా చదవండి

చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు. అయితే గాలిలోని నీటి ఆవిరి మొత్తాన్ని తేమ అంటారు. నీటి బిందువులు ఘనీభవించడం లేదా వాయువు నుండి ద్రవంగా మారడం ప్రారంభిస్తాయి. ఇది దట్టమైన పొగమంచులా కనిపిస్తుంది. దీనిని పొగమంచు అంటారు.

పొగమంచు ఎలా ఏర్పడుతుంది:

గాలి ఉష్ణోగ్రత, మంచు బిందువు మధ్య వ్యత్యాసం 2.5 °C (4.5 °F) కంటే తక్కువగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుంది. మన చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. దానిని మనం తేమ అని పిలుస్తాము. శీతాకాలంలో భూమి యొక్క ఉపరితలం దగ్గర ఉన్న వెచ్చని గాలిలో ఉన్న నీటి ఆవిరి పైన ఉన్న చల్లని గాలి పొరలతో కలపడం ద్వారా ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియను సంక్షేపణం అంటారు. చుట్టుపక్కల చల్లటి గాలిని తాకినప్పుడు, దాని రూపం పొగ మేఘంలా మారుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..