
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్లతో ఇయర్ ఎండ్ సేల్ ను రన్ చేస్తుంది. ఈ నెల 24న ప్రారంభమైన ఇయర్ ఎండ్ సేల్ 31 వరకూ కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సేల్ లో అన్ని ఉత్పత్తులపై తగ్గింపు రేట్లను ఆఫర్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ భారీ తగ్గింపును ప్రకటించింది. అయితే ప్రస్తుతం యువతను ఎక్కువుగా ఆకర్షిస్తున్న స్మార్ట్ వాచ్ లపై ఆఫర్ ప్రకటించడంతో వాటి కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ రేట్ తో రూ.3000 లోపు బ్లూ టూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉన్న స్మార్ట్ వాచ్ ల గురించి తెలుసుకుందాం.
ఈ వాచ్ మామూలు ధర రూ.4,999. అయితే ప్రస్తుతం ఇది రూ.2199 కు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఫెసిలిటీ తీసుకుంటే మరో పది శాతం వరకూ ఇన్ స్టెంట్ గా తగ్గింపు లభిస్తుంది. 1.87 అంగుళాల ఐపీఎస్ ఫుల్ స్క్రీన్ టచ్ కర్వ్ డ్ డిస్ ప్లే తో ఈ స్మార్ట్ వాచ్ యువతను ఆకట్టుకుంటుంది. ఎస్ పీఓ2, అలాగే బీపీను, నిద్ర సమయాన్ని కూడా లెక్కించడం దీని ప్రత్యేకత.
ఈ వాచ్ ప్రస్తుతం రూ.2199తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని అసలైన ధర రూ.9999. ఈ వాచ్ పై కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది. 1.85 ఇంచ్ ల డిస్ ప్లేతో వచ్చే ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ ను కలిగి ఉంది. ఈ వాచ్ ఏడు రోజుల వరకూ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది.
రూ.9999 ధర ఉన్న ఈ వాచ్ ఈ సేల్ రూ.2599 కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 1.72 ఇంచ్ ల డిస్ ప్లే తో ఉన్న ఈ వాచ్ ఎస్ పీఓను, బీపీ, నిద్ర సమయాన్ని కూడా లెక్కిస్తుంది. ఓ సారి చార్జ్ చేస్తే గరిష్టంగా 15 రోజుల వరకూ మళ్లీ చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదని ఆ కంపెనీ చెబుతుంది.
ఈ వాచ్ రూ.2999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఈ వాచ్ కు వస్తుంది. 1.8 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ వాచ్ 600 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. ఈ వాచ్ కూడా ఎస్ పీఓ 2, బీపీ, క్యాలరీలు, నిద్రను గణిస్తుంది. ఈ వాచ్ ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.
ఈ వాచ్ అసలు ధర రూ.5999. అయితే ప్రస్తుతం రూ.2999 కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 500 నిట్స్ బ్రైట్ నెస్ ఫీచర్ తో 1.85 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లేతో వస్తుంది. ఈ వాచ్ కూడా ఎస్ పీఓ 2, బీపీ, క్యాలరీలు, నిద్రను గణిస్తుంది. ఈ వాచ్ గరిష్టంగా పది రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం