Year end sale: అదిరిపోయే ఆఫర్‌.. రూ. 21వేల యాపిల్‌ ఎయిర్‌పోడ్స్‌ను రూ. 1490కే సొంతం చేసుకునే ఛాన్స్‌.

|

Dec 31, 2022 | 7:20 AM

2022 ఏడాది ముగుస్తున్న తరుణంలో ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సాధారణంగా యాపిల్‌ కంపెనీకి..

Year end sale: అదిరిపోయే ఆఫర్‌.. రూ. 21వేల యాపిల్‌ ఎయిర్‌పోడ్స్‌ను రూ. 1490కే సొంతం చేసుకునే ఛాన్స్‌.
Apple Airpods Pro
Follow us on

2022 ఏడాది ముగుస్తున్న తరుణంలో ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సాధారణంగా యాపిల్‌ కంపెనీకి చెందిన ప్రతీ ప్రొడక్ట్‌ ధర భారీగా ఉంటాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్‌ ఎయిర్‌పోడ్స్‌ ప్రో అసలు ధర రూ. 20,990గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇయర్‌ఎండ్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ ప్రోపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ పేమెంట్స్‌పై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. దీంతో ఈ ఎయిర్‌ పాడ్స్‌పై రూ. 2000 తగ్గింపుతో రూ. 18,990కే లభిస్తుంది. దీంతో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 17,500 వరకు తగ్గింపుతో పొందొచ్చు. దీంతో ఈ ఎయిర్‌ పాడ్స్‌ని రూ. 1490కే సొంతం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పాత ఫోన్‌ ధర ఫోన్‌ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఇక ఎయిర్‌ పాడ్స్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో అత్యాధునిక నాయిస్‌ క్యాన్సలైజేషన్‌ టెక్నాలజీని అందించారు. ఇయర్‌ ఫోన్స్‌ను టచ్‌తోనే కంట్రోల్‌ చేసుకునే అవకాశం ఉంది. చార్జింగ్‌ కేస్‌ను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 30 గంటలు పనిచేస్తుంది. ఐపీఎక్స్‌3 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. సిర వాయిస్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..