గూగుల్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 7. ఈ స్మార్ట్ ఫోన్‌కు వినియోగదారుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా త్వరలోనే గూగుల్ పిక్సెల్ సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఏను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ పిక్సెల్ 7పై భారీగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ అసలు రూ. 57,999కాగా అన్ని ఆఫర్లు కలుపుకొని రూ. 20,999కే సొంతం చేసుకునే అవకాశం కలిపించింది ఫ్లిప్‌కార్ట్. యాక్సిస్, అమెరికన్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌ఎస్, ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 7000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా రూ. 2000 అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 30,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.
ఇదిలా ఉంటే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.3 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ + అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080×2400పిక్సెల్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే సొంతం. 8జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్‌స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 4355 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 10.8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..