Smart TV: 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీని రూ. 15 వేలకు సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే.

|

Mar 19, 2023 | 1:58 PM

ప్రస్తుతం టీవీ అంటే స్మార్ట్‌ టీవీనే అనే రోజులు వచ్చేశాయ్‌. ఒకప్పుడు లక్షలు పలికిన స్మార్ట్‌ టీవీలు కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరకే మంచి ఫీచర్లున్న టీవీలు

Smart TV: 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీని రూ. 15 వేలకు సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే.
Representative Image
Follow us on

ప్రస్తుతం టీవీ అంటే స్మార్ట్‌ టీవీనే అనే రోజులు వచ్చేశాయ్‌. ఒకప్పుడు లక్షలు పలికిన స్మార్ట్‌ టీవీలు కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరకే మంచి ఫీచర్లున్న టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఆన్‌లైన్‌ సైట్స్‌ సైతం టీవీలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్లిప్‌కార్ట్ థామ్‌సన్‌ టీవీపై సూపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ద్వారా రూ. 47 వేలు విలువ చేసే స్మార్ట్‌ టీవీని రూ. 15 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే.

థామ్‌సన్‌ అర్థోప్రో మ్యాక్స్‌ 50 ఇంచెస్‌ టీవీ అసలు ధర రూ. 46,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో రూ. 26,999కే అందిస్తోంది. దీంతో పాటు కొనుగోలు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం తగ్గింపు అందిస్తోంది. దీంతో అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు పాత టీవీని ఎక్ఛేంచ్‌ చేయడం ద్వారా రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో అల్ట్రా హెచ్‌డీ, 4కే రిజల్యూజన్‌తో కూడిన 3840 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. డాల్బీ MS 12, DTS ట్రూ సరౌండ్.. 40 W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించారు. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీహాట్‌స్టార్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఇక ఇందులో 2జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ను అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..