Flipkart Big Saving Days: సమ్మర్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈకామర్స్ సైట్లు వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేలను ప్రకటించగా ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ సేవింగ్స్ డే పేరుతో డిస్కౌంట్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి మే4వ తేదీ నుంచి ప్రారంభమవుతుండగా, ఇతరులకు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే పేటీఎమ్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 100 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఇచ్చారు. ఇక ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పోకో సీ55 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 7999గా ఉంది. కొటాక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తారు. గూగుల్ పిక్సెల్ 6ఏ రూ. 25,999కి అందుబాటులోకి రానుంది. రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ రూ. 19,999కి లభించనుంది. వీటితో పాటు ఐఫోన్ 13ని రూ. 61,999కి అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా 55 ఇంచెస్ సామ్‌సంగ్ క్రిస్టల్ 4కే టీవీ ధర రూ. 45,990కాగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎమ్‌ఐ ఎక్స్ సిరీస్ స్మార్ట్ టీవీ (43 ఇంచెస్) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ రూ. 28,999కి అందుబాటులో ఉంది.
సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. లెనోవో రైజన్ 4 హెక్సా కోర్ ల్యాప్‌టాప్ రూ. 33,990 ధరకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీటితో పాటు రియల్‌మీ ఇంటెల్ ఈవో కోర్ ల్యాప్‌టాప్‌పై కూడా 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..