భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ స్థాయిలో ఫోన్ల వినియోగం పెరగడానికి జియో నెట్‌వర్క్ కారణమని తెలుసు. ఎందుకంటే అప్పటి వరకూ అధిక నెట్ చార్జీల వల్ల స్మార్ట్ ఫోన్లు కొన్ని వర్గాల వారికే పరిమితమయ్యాయి. అయితే వారందరికీ చెక్ పెడుతూ టెలికాం రంగంలోకి జియో రాకతో ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అన్ని కంపెనీలు తమ ఖాతాదారులను కాపాడుకోవడానికి తక్కువ ధరకే డేటా ప్లాన్లు ఇవ్వాల్సి వచ్చింది. అయినా మార్కెట్‌లో ఇప్పటికీ కనెక్టవిటీ పరంగా, డేటా చార్జీల పరంగా వినియోగదారుల జియో వైపే మొగ్గు చూపుతున్నారు. జియో కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా జియో ఐదు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో పాటు డేటా అలాగే జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు వస్తుంది. ఈ ఐదు ప్లాన్ల గురించి అదనపు వివరాలపై ఓ లుక్కేద్దాం.
రూ.269 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు 1.5 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంస్‌లు మరియు అన్ని నెట్‌వర్క్‌లతో అపరిమిత కాలింగ్ సదుపాయం పొందుతారు. దీంతో పాటు జియో సావన్ ప్రోసబ్‌స్క్రిప్షన్‌తో ఇతర జియో యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో అర్హత కలిగిన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.
రూ.589 ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఇందులో వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో హై-స్పీడ్ 2 జీబీ డేటాను పొందుతారు. దీనితో ప్లాన్‌లో జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర జియో యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. 5 జీ సర్వీస్ అందుబాటులో ఉన్న నగరాల్లో ఉన్న వినియోగదారుల 4జీ ధరకే 5జీ సర్వీసులను పొందవచ్చు.
రూ.529 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో, వినియోగదారులు 1.5 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ పొందుతారు. జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో ఇతర జియో యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, అర్హత కలిగిన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.
రూ.789 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో, వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు హై-స్పీడ్ 2 జీబీ డేటాను పొందుతారు. ప్లాన్‌లో జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర జియో యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో అర్హత కలిగిన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను కూడా పొందుతారు.
రూ.739 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో వినియోగదారులు 1.5 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ పొందుతారు. అలాగే జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో ఇతర జియో యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. అర్హత ఉన్న కస్టమర్లు అపరిమిత 5 జీ డేటా పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..