Fingerprint: వ్యక్తి చనిపోయిన తర్వాత ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు వేలి ముద్రలు ఎందుకు పని చేయవు..?

|

Sep 20, 2022 | 5:53 AM

Fingerprint: మానవుని వేలిముద్రల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వేలిముద్రలు సాధారణ సమయంలోనే కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలలు ఉపయోగపడుతుంటాయి..

Fingerprint: వ్యక్తి చనిపోయిన తర్వాత ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు వేలి ముద్రలు ఎందుకు పని చేయవు..?
Fingerprint
Follow us on

Fingerprint: మానవుని వేలిముద్రల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వేలిముద్రలు సాధారణ సమయంలోనే కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలలు ఉపయోగపడుతుంటాయి. పెన్ను చేతపట్టి సంతకం చేయలేని వారు వేలి ముద్రను ఉపయోగిస్తుంటారు. అయితే అందరి వేలి ముద్రలు ఒకేలా ఉండవు. ఇవే కాకుండా ఏదైనా ఇన్వెస్టిగేషన్‌లో ఈ వేలిముద్రల ద్వారా వివరాలు రాబట్టవచ్చు. వేలిముద్రలను ఆధార్‌, పాన్‌ కార్డులలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు కూడా ఈ వేలిముద్రలు ఎంతో అవసరం. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వేలిముద్రలను ఉపయోగించవచ్చా..? అయితే వేలిముద్రలతో ఉన్న ఫోన్‌లాక్‌ను ఆ చనిపోయిన వ్యక్తితో అన్‌లాక్‌ చేయవచ్చా..? మరి మనిషి జీవించి ఉన్నప్పుడు వేలిముద్రలు.. చనిపోయిన తర్వాత ఎందుకు మరిపోతాయి..? ఇటువంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతుంటాయి.

బతికున్నప్పుడు ఉన్నవేలిముద్రలు చనిపోయాక ఎందుకు ఉండవు:

ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని శరీరం రంగు మారుతుంది. మృతి చెందిన వ్యక్తి ఎక్కువ రోజులు అయితే శరీరం అంతా కుళ్లిపోతుంది. దుర్వాసన వస్తుంటుంది. అలాంటి సమయంలో కూడా నిపుణులు వేలిముద్రలను గుర్తించగలుగుతారు. ఇది ప్రక్రియ టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది. బతికి ఉన్నప్పుడు ఉన్న వేలిముద్రలు చనిపోయిన తర్వాత ఉండవు. ఎందుకంటే శరీరంతో పాటు వేలిముద్రలు కూడా మరిపోతాయి. కానీ ఇన్వెస్ట్‌గేషన్‌లో భాగంగా బతికి ఉన్న సమయంలో ఉన్న వేలిముద్రలను, చనిపోయిన తర్వాత కూడా గుర్తించగలుగుతారు నిపుణులు. వీటిని ఫోరెన్సిక్‌ నిపుణులు ల్యాబ్‌లలో గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి

ఫోరెన్సిక్‌ నిపుణులు జీవించి ఉన్న, చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను గుర్తించేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో సాంకేతికపరంగా సులభంగా గుర్తించగలుగుతారు. మీరు ఫోన్‌ అన్‌లాక్‌ చేయాలంటే చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో చేయలేరు. ఒక వేళ ఓ వ్యక్తి ఏదైనా ప్రమాదం కారణంగా అతను చనిపోయాడా..? బతికి ఉన్నాడా..? అనే విషయాన్ని మొబైల్‌ అన్‌లాక్‌ ద్వారా కూడా అంచనా వేయవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే అతని వేలిముద్రలు పూర్తిగా మారిపోతాయి. అలాంటి సమయంలో ఫోన్‌ అన్‌లాక్‌ వేలిముద్రలు మ్యాచ్‌ కావు. వాస్తవానికి మొబైల్‌ ఫోన్‌ సెన్సార్‌ కూడా ఒక వ్యక్తి వేళ్లలో నడిచే విద్యుత్‌ ప్రసరణ ఆధారంగా పని చేస్తుంది. మనిషి మరణించిన తర్వాత అతని శరీరంలో ఉన్న విద్యుత్‌ ప్రసరణ నిలిచిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మొబైల్‌ సెన్సార్లు విద్యుత్‌ ప్రసరణ లేకుండా వేళ్లను గుర్తించలేవు. అందుకే వ్యక్తి బతికున్నప్పుడు.. చనిపోయినప్పుడు వేలిముద్రల్లో తేడాలు ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..