WhatsApp And Facebook: సేవలను పునరుద్దరించిన ఫేస్‌బుక్‌.. 7 గంటల తర్వాత ఓపెన్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాఫ్‌లు

|

Oct 05, 2021 | 5:08 AM

WhatsApp And Facebook: ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫేస్‌బుక్‌

WhatsApp And Facebook: సేవలను పునరుద్దరించిన ఫేస్‌బుక్‌.. 7 గంటల తర్వాత ఓపెన్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాఫ్‌లు
Whatsapp
Follow us on

WhatsApp And Facebook: ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తున్నాయి. 7 గంటల తర్వాత ఫేస్‌బుక్‌ తన సేవలను పునరుద్దరించింది. ఈ 3 సోషల్ నెట్‌వర్క్ యాప్స్‌ తిరిగి పనిచేయడం ప్రారంభించడంతో యూజర్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం వీటి సేవలు అందుబాటులోకి రావడంతో యూజర్లు సందేశాలతో హోరెత్తిస్తున్నారు. చాటింగ్, షేరింగ్స్‌, కామెంట్స్, లైక్స్‌ ప్రారంభించారు. అయితే కొద్దిసేపు ఈ మూడు యాప్స్‌ పనిచేయకపోవడంతో ప్రపంచం స్తంభించిపోయినట్లయింది. నెటిజన్లు మొత్తం ఆగమాగం అయ్యారు.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోనే ఈ 3 సోషల్‌ మీడియా యాప్స్ పనిచేస్తాయి. దాదాపుగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ పని చేయడం లేదు. యూజర్లు పంపించిన మెసేజ్‌లు ఫార్వర్డ్ అవలేదు. మొదటగా చాలామంది యూజర్లు తమకు మాత్రమే ఇలా జరుగుతోందా… లేక అందరికీ ఇదే సమస్య తలెత్తిందా అన్న అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించి ఇతర మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఫేస్‎బుక్, ఇన్‎స్టాగ్రామ్, వాట్సప్ సేవలను యాక్సెస్ చేసుకువడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై స్పందించిన ఫేస్‌బుక్‌ “క్షమించండి, ఏదో తప్పు జరిగింది. మేము దానిపై వర్క్‌ చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం” అని ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్ పెట్టింది.

గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి సమస్య ఎదురైంది కానీ ఎప్పుడు ఇంత సమయం పట్టలేదు. 5 నుంచి 10 నిమిషాలలో సమస్య పరిష్కారం అయ్యేది. అయితే సోమవారం సాయంత్రం నుంచే వివిధ దేశాల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్ అయినట్లు మెస్సేజ్‌లు వచ్చాయి. ఈ సమస్య వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. భారతదేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

Viral Video: పెళ్లి కళ వచ్చేసిందే బాల.. వరుడు వస్తున్న ఆనందంలో ఈ వధువు ఏం చేసిందో చూశారా ?