Facebook – Meta: మారిన ఫేస్‌బుక్ పేరు.. కొత్త పేరు ఇదేనంటూ ప్రకటించిన మార్క్ జూకర్‌బర్గ్..

|

Oct 29, 2021 | 6:56 AM

Facebook - Meta: అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు మారింది. ఇదే విషయాన్ని..

Facebook - Meta: మారిన ఫేస్‌బుక్ పేరు.. కొత్త పేరు ఇదేనంటూ ప్రకటించిన మార్క్ జూకర్‌బర్గ్..
Zukarberg
Follow us on

Facebook – Meta: అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ పేరు మారింది. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరును మెటా గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త సింబల్ MVRS తో ట్రేడ్ అవుతాయని తెలిపారు. MVRS అంటే మెటా వర్స్(metaverse). మెటా వర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం. దీనికి సంబంధించిన కొత్తలోగోను గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించారు. అయితే, మాతృసంస్థ పేరు మారిందే తప్ప.. ఫేస్‌బుక్‌ కింద ఇంతకాలం కొనసాగిన సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి.

కాగా, మేటా లోగో ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన జూకర్ బర్గ్.. ‘‘ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాండ్‌ పేరు మారింది. ‘మెటావర్స్‌’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నాం. వర్చువల్‌-రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, సంబంధిత అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి.’’ అని పేర్కొన్నారు. కాగా, ఇ

కాగా, ప్రైవసీ, సేవల్లో అంతరాయాలు వంటి అంశాలపై ఫేస్‌బుక్ తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీపై వస్తున్న ఆరోపణలు, కంపెనీ ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని టెక్ విశ్లేషకులు అంటున్నారు. ఇదోరకరమైన గిమ్మిక్ అంటున్నారు.

Also read:

PM Narendra Modi: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ

Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..

YCP Vs TDP: కర్నూలు జిల్లాలో స్థల విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ… ఇరువురు నేతలు అరెస్ట్..