Elon Musk: ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం.. ఇక కంటెంట్ క్రియేటర్లకు పండగే

|

Jun 11, 2023 | 8:41 AM

ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఎలాన్ మస్క్. గత ఏడాది ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఆయన మరింత దూకుడు పెంచేశారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకొస్తు ట్విట్టర్ రూపురేఖలే మార్చేస్తున్నారు.

Elon Musk: ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం.. ఇక కంటెంట్ క్రియేటర్లకు పండగే
Elon Musk
Follow us on

ఎప్పుడూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు ఎలాన్ మస్క్. గత ఏడాది ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఆయన మరింత దూకుడు పెంచేశారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకొస్తు ట్విట్టర్ రూపురేఖలే మార్చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేశాడు. ఇది కంటెంట్ క్రియేటర్లకు పెద్ద పండగే అని చెప్పాలి. ఇక నుంచి కంటెంట్ క్రియేటర్లు కూడా ట్విట్టర్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనున్నారు ఎలాన్ మస్క్. మరో కొన్ని వారాల్లోనే ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నవారికి వారి కంటెంట్ రిప్లై సెక్షన్‌లో యాడ్స్ వస్తాయని ఎలాన్ మస్క్ తెలిపారు. అయితే వెరిఫైడ్ క్రియేటర్లకు మాత్రమే ఈ యాడ్స్ వచ్చే సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. మొదటి పేయిమెంట్ల కోసం 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41.2 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఇక ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తున్న మస్క్.. మొదట్లో బ్లూ టిక్ పెయిడ్ మెంబర్‌షిప్ తీసుకొచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. డబ్బులు కడితే ఎవరైనా ఈ బ్లూ టిక్‌ను పొందవచ్చు. మరో విషయం ఏంటంటే బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉన్నవారు 60 నిమిషాల వరకు వారి ట్వీట్ పోస్టును ఎడిట్ చేసుకోవచ్చు. అయితే గతంలో ఇది కేవలం 30 నిమిషాల వరకే ఉండేంది. ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ద్వారా యాడ్ల రూపంలో డబ్బులు సంపాదించుకనే అవకాశం ఉంది.  ఇప్పుడు ట్విట్టర్ కూడా దీని వరుసలో చేరనుండటంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..