Elon Musk: ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

|

Jul 09, 2022 | 7:43 AM

Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తోన్న మస్క్‌ ఇప్పుడు...

Elon Musk: ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..
Follow us on

Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తోన్న మస్క్‌ ఇప్పుడు ఆ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ట్విట్టర్‌ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందలోని పలు నిబంధనలు సంస్థ ఉల్లంఘించందన్న కారణంతో కొనుగోలును రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ తెలిపారు. ట్విట్టర్‌ చెప్పిన దానకంటే నకిలీ ఖాతాలు నాలుగింతలు ఉన్నాయని మస్క్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే గడిచిన ఏప్రిల్‌లో ట్విట్టర్‌ కొనుగోలు చేసేందుకు మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. అయితే స్పామ్‌, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విటర్‌ ఇవ్వడం లేదని గత మే నెలలోలో ఈ డీల్‌ను ముందుకు వెళ్లకుండా మస్క్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కొనుగోలు ఒప్పందంపై వెనక్కి తగ్గడాన్ని ట్విట్టర్ తీవ్రంగా పరిగణిస్తోంది. మస్క్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మస్క్‌తో అంగీకరించిన ధర, నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని, విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు. మరి ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..