స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు యాపిల్ ఫోన్స్ అంటే ఓ క్రేజ్. ఎందుకంటే ఆ ఫోన్‌లో వచ్చే ఫీచర్స్, సెక్యూరిటీ సదుపాయాలు ఏ ఇతర ఫోన్స్‌లో రాకపోవడంతో వినియోగదారులను యాపిల్ ఫోన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాపిల్ ఫోన్స్ అంటే ఎగువ శ్రేణి ప్రజలే ఎక్కువగా వాడుతుంటారు. యాపిల్ ఫోన్స్‌కు భారత్‌లో పెరుగుతున్నఆదరణ నేపథ్యంలో ఆ కంపెనీ కూడా ఇటీవల యాపిల్ రిటైల్ స్టోర్స్‌ను ముంబై, ఢిల్లీలో కూడా ప్రారంభించారు. భారత్‌లో యాపిల్ ఫోన్‌ను స్టేటస్ సింబల్‌గా మారింది. ఐఫోన్, ఐమాక్ మొదలైన ఉత్పత్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మకందారుల ద్వారా భారతదేశ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఐ ఫోన్‌ను కూడా మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయవచ్చు. ఈక్వెటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్( ఈఎంఐ) పద్ధతిలో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఫోన్ కొనుగోలు చేయాలంటే ఫోన్ ధరపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. నెలనెలా కొంత సొమ్మును కట్టి కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ కింద ఫోన్ కొనాలంటే మీరు ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేటు వంటి ఛార్జీలను తప్పక తనిఖీ చేయాలి. ధర ఎక్కువగా ఉన్నా ఈఎంఐ పద్ధతిలో ఐ ఫోన్ ఎలా కొనాలో? ఓ సారి తెలుసుకుందాం.
యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో ఎంచుకున్న ఉత్పత్తులపై ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే చాలా బ్యాంకుల నుంచి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. అలాగే ఎవరైనా Apple స్టోర్‌లో అర్హత కలిగిన మ్యాక్, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 నాటికి వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై ఐ ఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై రూ. 6000 తగ్గింపు లభిస్తుంది. అలాగే ఐ ఫోన్ 14, 14 ప్లస్‌పై రూ.5000, ఐఫోన్ 13పై రూ.40000 తగ్గింపు లభిస్తుంది. అలాగే మూడు, ఆరు నెలల ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి