WhatsApp: వాట్సప్‌లో పొరపాటున ఛాట్స్ డిలీట్ అయ్యాయా..? ఈ చిన్న ట్రిక్‌తో తిరిగి పొందోచ్చు.. ఎవరికీ తెలియని సీక్రెట్ ఫీచర్..

వాట్సప్‌ అంటూ ఉపయోగించని స్మార్ట్‌ఫోన్ యూజర్లు దాదాపు ఉండరు. సులభంగా ఛాట్స్ చేసుకునేందుకు లేదా ఫైల్స్, ఫొటోలు, వీడియోలు పంపుకునేందుకు వాట్సప్ ఉపయోగిస్తుంటారు. ఇక వాయిస్, వీడియో కాల్స్ అన్నీ ఒకేచోట మాట్లాడుకునేందుకు వినియోగిస్తూ ఉంటారు. వాట్సప్‌లో వ్యక్తిగత వివరాలు డిలీట్ అయినప్పుడు ఏం చేయాలి..?

WhatsApp: వాట్సప్‌లో పొరపాటున ఛాట్స్ డిలీట్ అయ్యాయా..? ఈ చిన్న ట్రిక్‌తో తిరిగి పొందోచ్చు.. ఎవరికీ తెలియని సీక్రెట్ ఫీచర్..
Whats App

Updated on: Dec 31, 2025 | 4:27 PM

వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ అవసరాల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. రోజుకు ఒక్కసారైనా వాట్సప్ ఓపెన్ చేయకుండా ఎవరూ ఉండలేరు. ఇతరులతో కమ్యూనికేషన్‌ అవ్వడానికే కాకుండా వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు భద్రపర్చుకోవడానికి చాలామంది వాట్సప్ వాడుతూ ఉంటారు. బ్యాంకింగ్ వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫొటోలు వంటివి వాట్సప్‌లో భద్రపర్చుకుంటారు. వాట్సప్‌లో మెయిల్ ద్వారా బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మన వివరాలు ఎక్కడికీ పోవు. వేరే ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసినా మీ ఛాట్‌లన్నీ బ్యాకప్ ద్వారా కనిపిస్తాయి. కొన్నిసార్లు పొరపాటు వల్ల ఛాట్స్ డిలీట్ అవుతూ ఉంటాయి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు వాటిని మళ్లీ పొందోచ్చు.

బ్యాకప్ లేకుండా ఎలా పొందాలి..?

కొన్ని పద్దతుల పాటించడం వల్ల మీరు బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేసుకోకపోయినా డిలీట్ అయిన ఛాట్‌లను పొందవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ ఫైల్ ఓపెన్ చేయాలి. అందులో వాట్సప్ పేరుతో ఉండే ఫైల్ ఓపెన్ చేయండి. డేటాబేస్ ఫోల్డర్‌లోకి వెళితే రీసెంట్ డేట్స్‌తో సేవ్ అయిన ఫైల్స్ కనిపిస్తాయి. మీరు వాట్సప్ బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేయకపోయినా ఇందులో ఫైల్స్ సేవ్ అయి ఉంటాయి. అక్కడ ఫైల్స్ కనిపిస్తే.. మీరు వాట్సప్‌ను డిలీట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. దీంతో వాట్సప్ లోకల్ ఫైల్స్‌ను గుర్తించి మీ ఛాట్‌లను పునరుద్దరిస్తుంది. వాట్సప్‌లో వచ్చే ఫైల్స్ ఆటోమేటిక్‌గా ఫైల్ మేనేజర్‌లో సేవ్ అయ్యేలా ఆప్షన్ ఆన్ చేసుకుంటే మాత్రమే ఈ పద్దతి ద్వారా ఫైల్స్‌ను తిరిగి పొందొచ్చు.

ఇలా కూడా ట్రై చేయండి

 

మీరు ఎవరితో అయితే ఫైల్స్‌ను పంచుకున్నారో వాళ్లని తిరిగి పంపించమని అడగండి. దీని ద్వారా మీ వాట్సప్‌లో డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందవచ్చు. ఈ రెండు మార్గాల్లో మీరు బ్యాకప్ ఆప్షన్ ఆన్ చేసుకోకపోయినా మీ ఛాట్‌లను తిరిగి పొందవచ్చు.