WhatsApp UPI: పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి. ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అనివార్యంగా డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. దీంతో రకరకాల పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్‌పే లాంటివి మొదట్లో బాగా ప్రాచుర్యం పొందాయి.
అయితే ఆ తర్వాత ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్ కూడా వాట్సాప్‌లో పేమెంట్స్ ఆప్షన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2018లో వాట్సాప్ పే పేరుతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌పేలో మొత్తం 227 బ్యాంకులు అనుసంధానం ఉన్నాయి. వాట్సాప్ పే సహాయంతో డబ్బులు పంపించుకోవడంతో పాటు, బ్యాలెన్స్ చెకింగ్, యూపీఐ పిన్ కూడా మార్చుకోవచ్చు. అయితే చాలా మందికి వాట్సాప్‌పే ద్వారా డబ్బులు పంపించుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మాత్రమే తెలుసు.. కానీ యూపీఐ పిన్ ఎలా మార్చుకోవాలో తెలియదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా యూపీఐ పిన్‌ను మార్చుకోవచ్చు.. అవేంటంటే..
* ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లు కుడివైపు పైన ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేసి పేమెంట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఐఫోన్ యూజర్లు కింద కుడివైపు ఉన్న సెట్టింగ్స్‌లో ఉండే పేమెంట్స్ ఆప్షన్స్‌కి వెళ్లాలి.
* పేమెంట్స్ ఆప్షన్ కింద ఉండే బ్యాంక్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత చేంజ్ యూపీఐ పిన్ ఆప్షన్‌ను నొక్కాలి.
* ఇప్పుడు మీ పాత యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి రెండో బాక్సులో మీరు మార్చాలనుకుంటున్న పిన్‌ను ఎంటర్ చేయాలి.
* చివరిగా పిన్‌ను కన్ఫామ్ చేస్తే సరిపోతుంది. మీ పిన్ చేంజ్ అవుతుంది.
Also Read: Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి 30 శాతం పెరిగిన ఇన్సెంటీవ్స్.. పూర్తివివరాలివే..
New Car: మార్కెట్లోకి రాబోతున్న అదిరిపోయే ఐదు కార్లు ఇవే..
ICC Women World Cup 2022: ఐసీసీ వరల్డ్ కప్ 2022 భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?