Fake Facebook Account: ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లను క్రియేట్ చేసుకుని అమాయకులకు వల వేస్తున్నారు. కొంత మంది నేరగాళ్లు మనకు తెలియకుండా మన పేరు, ఫోటోతో నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేస్తు్న్నారు. వాటి ద్వారా మన స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. వాళ్లు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే.. ఎమర్జెన్సీగా కొంత డబ్బు అవసరం ఉందని అడుగుతున్నారు. ఇది నిజమే అనుకుని చాలామంది డబ్బులు పంపి మోసపోతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే జరుగున్నాయి. తీరా అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసేలోపే సైబర్ నేరగాళ్ల చిక్కుల్లో పడిపోతున్నారు. అయితే మీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించినప్పుడు.. పోలీసుల వద్దకు వెళ్లకుండా ఆ నకిలీ అకౌంట్‌ను మనమే డిలీట్ చేసుకోవచ్చు. అదేలాగంటే..
► మీ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తిస్తే.. ముందుగా అకౌంట్ ఓపెన్ చేయండి.
► అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఫొటో కింద కుడివైపు ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత find support or report profile అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
► అప్పుడు ఎందుకు రిపోర్టు చేస్తున్నామనే ఆప్షన్ కారణాలతో చూపిస్తుంది.
► వాటిలో ఫేక్ అకౌంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రిపోర్టు పూర్తి చేయాలి.
► మీరు మాత్రమే కాకుండా మీ మిత్రులు మరో 20 మందితో ఇదే విధంగా అకౌంట్‌పై రిపోర్టు చేయాలి.
► అప్పుడు ఫేస్‌బుక్ దీనిని పరిశీలించి నకిలీ ఖాతాను డిలీట్ చేస్తుంది.
ఈ విధంగా మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నట్లయితే వెంటనే ఇలా చేయడం మంచిది. ఇలాంటి సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్ది సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.