
ఈ రోజుల్లో సమాచారం తెలుసుకోవడానికి లేదా వర్క్ టాస్క్‌లు ఈజీగా కంప్లీట్ కావడానికి చాలామంది ఏఐ టూల్స్ వాడుతున్నారు. ఏ చిన్న డౌట్ వచ్చినా లేదా వర్క్ పరంగా ఏదైనా పని సులువుగా చేయాలన్నా ఏఐ చాట్ బాట్స్ ఉపయోగిస్తున్నారు. దీంతో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రోక్ వంటి ఏఐ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. అలాగే కొత్త కొత్త టూల్స్ కూడా వస్తోన్నాయి. ఇప్పటికే ఉన్న ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ అప్‌డేటెడ్ వెర్షన్లను కూడా రిలీజ్ చేస్తూ వినియోగదారులను పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయి. అయితే ఏఐ టూల్స్ వాడకం బాగా పెరిగిన క్రమంలో వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కొంతమంది ఏఐ టూల్స్ అతిగా వాడుతూ ఉంటారు. ప్రతీ విషయానికి యూజ్ చేస్తూ ఉంటారు. అయితే సున్నితమైన సమాచారం అందించడం లేదా నేరపరమైన అంశాల గురించి తెలుసుకునేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటి గురించి తెలుసుకోవాలకుంటే మీ ప్రైవసీ, భద్రతకు ముప్పు ఉంటుందని చెబుతున్నారు. కొంతమంది ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఏఐని ఏ మెడిసిన్స్ వాడాలనేది అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏఐ తప్పుగా ఇచ్చే అవకాశముంది. అందుకే అనారోగ్య విషయాల గురించి ఏఐ సలహాలు తీసుకోకపోవడమే మంచిది
ఇక ఓటీపీలు, బ్యాంక్ పాస్‌వర్డ్స్, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలు వంటి వాటిని ఏఐ చాట్‌బాట్‌లలో టైప్ చేయకండి. దీని వల్ల మీ సమాచారం ఇతరులకు లీక్ అయ్యి ముప్పు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక హ్యాకింగ్ ఎలా చేయాలి.. ? పన్నులు ఎలా ఎగ్గొట్టకుండా వదిలించుకోవాలి? లాంటి అనే చట్టవిరుద్దమైన విషయాల గురించి ఏఐని అడక్కండి. ఆన్‌లైన్‌లో మీ సెర్చ్‌లపై నిఘా ఉండే అవకాశముంది. అందుకే వాటి జోలికి అసలు పొవద్దు. ఇక మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ ఆర్ధిక, సామాజిక విషయాల గురించి ఏఐను అడగకండి.