Dell Inspiron Laptops: భారత మార్కెట్లోకి 4 డెల్ ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాస్స్‌​.. ధర రూ. 45,000 నుంచి మొదలు!

|

Jun 20, 2021 | 8:43 PM

భారత మార్కెట్‌లోకి డెల్ 4 ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను విడుదల చేసింది. రీడిజైన్​ చేసి​ రిలీజ్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు కూడా మొదలయ్యామని, మరికొన్ని త్వరలో సేల్‌కు రానున్నాయని సంస్థ పేర్కొంది.

Dell Inspiron Laptops: భారత మార్కెట్లోకి 4 డెల్ ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాస్స్‌​.. ధర రూ. 45,000 నుంచి మొదలు!
Dell Inspiron
Follow us on

Dell Inspiron Laptops: భారత మార్కెట్‌లోకి డెల్ 4 ఇన్​స్పిరాన్​ ల్యాప్​టాప్​లను విడుదల చేసింది. రీడిజైన్​ చేసి​ రిలీజ్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు కూడా మొదలైనట్లు సంస్థ పేర్కొంది. QHD ప్లస్ స్క్రీన్​ రిజల్యూషన్ తో వచ్చిన ఈ ల్యాప్​టాప్​లు 13, 14, 15 అంగుళాల స్క్రీన్‌లతో విడుదలయ్యాయి. ఇందులో ఇన్​స్పిరాన్​ 14 2-ఇన్ -1, డెల్ ఇన్​స్పిరాన్​ 14, డెల్ ఇన్​స్పిరాన్​ 15, డెల్ ఇన్​స్పిరాన్​ 13 మోడల్స్ ఉన్నాయి. ఈ లాప్‌ట్యాప్‌ ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్లతో విడుదలయ్యాయి. అన్ని ల్యాప్‌టాప్‌లు హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో పాటు, ఎక్స్‌ప్రెస్ ఛార్జింగ్‌కు సఫోర్ట్ చేయనున్నాయి.

డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 ఇన్ 1)
డెల్ ఇన్​స్పిరాన్ లో 14 అంగుళాల ఫుల్​ హెచ్‌డి టచ్ స్క్రీన్‌ అందించారు. అయితే ఈ ల్యాప్​టాప్​.. టాబ్లెట్​గానూ పనిచేయనుందని కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఇందులో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌, రేడియన్ గ్రాఫిక్‌ కార్డ్​తో కూడిన ఏఎండీ రైజెన్ మొబైల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 ఇన్ 1) ఇంటెల్​ కాన్ఫిగరేషన్​ ల్యాప్​టాప్​ రూ. 57,990 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. అలాగే AMD కాన్ఫిగరేషన్ ల్యాప్​టాప్​​​ రూ. 65,990 ధర వద్ద లభిస్తుంది.

ఇన్​స్పిరాన్ 13
డెల్ ఇన్​స్పిరాన్ 13 ల్యాప్‌ టాప్ స్లిమ్, లైట్ డిజైన్ తో విడుదలైంది. 13.3 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.25 కేజీల బరువు ఉంది. అల్యూమినియం ప్యానెల్​తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇన్​బిల్ట్​ టీయూవీ, లో బ్లూ లైట్ హార్డ్‌వేర్ సొల్యూషన్‌ లాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ పై ఎంత సేపు పని చేసినప్పటికీ కంటిపై ఎలాంటి ఒత్తిడి పడదని కంపెనీ వెల్లడించింది. ఇన్​స్పిరాన్ 13 ల్యాప్​టాప్​ అమ్మకాలు జూలై 7 నుంచి మొదలుకానున్నాయి. ఇది రూ .68,990 ప్రారంభ ధరతో సేల్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

డెల్ ఇన్​స్పిరాన్ 14, ఇన్​స్పిరాన్ 15
డెల్ ఇన్​స్పిరాన్ 14, ఇన్​స్పిరాన్ 15 ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ హెచ్-గ్రేడ్ ప్రాసెసర్​తో అలరించనున్నాయి. వీటిలో ఎన్విడియా ఎంఎక్స్450 గ్రాఫిక్స్ కార్డును యాడ్ చేశారు. వీటితో పాటు తాజాగా తన ఇన్​స్పిరాన్ 15 రెండో వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఇది రేడియన్ గ్రాఫిక్‌తో ఉన్న ఏఎండీ రైజెన్ మొబైల్ ప్రాసెసర్​తో పనిచేయనుంది. డెల్ ఇన్​స్పిరాన్ 14.. 11 వ జనరేషన్‌ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో రాగా, ఇన్​స్పిరాన్ 15 ఇంటెల్, ఏఎండీ ప్రాసెసర్లతో వచ్చింది. వీటిల్లో16జీబీ ర్యామ్, 1 టీజీ వరకు స్టోరేజ్ అందిచారు. డెల్​ ఇన్​స్పిరాన్ 14 ధర రూ .44,990తో ప్రారంభం కానుంది. ఇంటెల్ కాన్ఫిగరేషన్‌లతో వచ్చిన డెల్ ఇన్‌స్పిరాన్ 15 ధర రూ.48,990 వద్ద ప్రారంభమవుతుంది. ఏఎండీ కాన్ఫిగరేషన్‌లతో విడుదలైన డెల్ ఇన్‌స్పిరాన్ 15.. అమ్మకాలు జూన్ 22న మొదలుకానున్నాయి. ఇది రూ. 57,990 ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ రీడిజైన్​ ల్యాప్​టాప్​లను డెల్​ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ వెబ్​సైట్​ నుంచి కొనుగోలు చేయవచ్చని డెల్ సంస్థ తెలిపింది.

Also REad:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌తో క్రియేటర్లకు పండుగ.. యూజర్లకు తలనొప్పి!

Mi 11 Lite: జూన్‌ 22 న రిలీజ్ కానున్న ఎంఐ 11 లైట్.. ధర ఎంతంటే?