ఇండియన్ నేవీ‌లోకి ‘ఐఎన్‌ఎస్‌ ఖండేరీ’!

భారత నౌకాదళం మరింత బలోపేతం కాబోతోంది. భారత్‌లో తయారైన అత్యాధునిక స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ శనివారం నావికాదళంలో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే ఆధునిక ఫీచర్లున్న జలాంతర్గామి ఇదే కావడం విశేషం. మొదటి స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరీ 2017 డిసెంబరులో భారత అమ్ముల పొదిలో చేరింది. ప్రాజెక్టు 75లో భాగంగా మొత్తం ఆరు జలాంతర్గాములు తయారు కానుండగా, ఐఎన్‌ఎస్‌ ఖండేరీ రెండోది. ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ […]

ఇండియన్ నేవీ‌లోకి 'ఐఎన్‌ఎస్‌ ఖండేరీ'!
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 6:38 PM

భారత నౌకాదళం మరింత బలోపేతం కాబోతోంది. భారత్‌లో తయారైన అత్యాధునిక స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ శనివారం నావికాదళంలో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే ఆధునిక ఫీచర్లున్న జలాంతర్గామి ఇదే కావడం విశేషం. మొదటి స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కల్వరీ 2017 డిసెంబరులో భారత అమ్ముల పొదిలో చేరింది. ప్రాజెక్టు 75లో భాగంగా మొత్తం ఆరు జలాంతర్గాములు తయారు కానుండగా, ఐఎన్‌ఎస్‌ ఖండేరీ రెండోది. ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌ ఈ జలాంతర్గామి ఆకృతిని రూపొందించగా.. దీన్ని పూర్తిగా భారత్‌లోనే తయారు చేశారు. ముంబయికి చెందిన మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ సంస్థ దీన్ని నిర్మించింది.

శత్రు నౌకలకు అంతుచిక్కని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్‌ఎస్‌ ఖండేరీని ‘సైలెంట్‌ కిల్లర్‌’గా కూడా పిలుస్తారు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీని శత్రు నౌకలు గుర్తించడం అత్యంత కష్టం. ఎందుకంటే దీని సమాచారం ఇతర నౌకలకు తెలియకుండా చేసే వ్యూహాత్మక ఫీచర్లున్నాయి. జలాంతర్గామికి వెనుక మాగ్నెటైస్డ్‌ ప్రొపల్షన్‌ మోటార్‌ (ఫ్రెంచ్‌ సాంకేతికత) ఏర్పాటు చేశారు. లోపలి నుంచే వచ్చే శబ్దాన్ని దాని శరీరం చాలా వరకూ నిరోధిస్తుంది. తద్వారా శత్రు నౌకలు ఐఎన్‌ఎస్‌ ఖండేరీ జాడను సులభంగా అంచనా వేయలేవు.

ఐఎన్‌ఎస్‌ ఖండేరీలో ఐదురుగురు నేవీ అధికారులు ఉంటారు. 35 మంది నావికా సిబ్బంది ఉంటారు. జలాంతర్గామిలో స్వయం చోదక ఆయుధాలైన 18 ఎస్‌యూటీ టార్పెడోలు, యాంటీ షిప్‌ క్షిపణులను లోడ్‌ చేసి తీసుకెళ్లొచ్చు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీ భారత నావికాదళానికి ప్రతిష్ఠాత్మకం కానుందని ఈ జలాంతర్గామికి కమాండింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్న కెప్టెన్‌ దల్బీర్‌ సింగ్‌ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు.