Oppo Smart TV: స్మార్ట్ ఫోన్‌లతో మొదలైన స్మార్ట్ యుగం ఇప్పుడు అన్ని గ్యాడ్జెట్లకు విస్తరించింది. ఇంట్లో ఉపయోగించే బల్బ్ నుంచి ఫ్యాన్ వరకు ఇలా ప్రతీ గ్యాడ్జెట్ స్మార్ట్‌గా మారిపోతోంది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే స్మార్ట్ టీవీలు. మారుతోన్న కాలానికి అనుగుణంగా టీవీల్లో మార్పులు వచ్చాయి. ఇక వినియోగదారులు కూడా స్మార్ట్ టీవీలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బడా కంపెనీలన్నీ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం విపరీతంగా ఉన్న ధరలు ఇప్పుడు విపరీతంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా చైనాకు చెందిన పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో పోటీ పెరిగింది. దీంతో స్మార్ట్ టీవీల ధరలు భారీగా తగ్గాయి.
ఇప్పటికే వన్‌ప్లస్, ఎమ్‌ఐ వంటి స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు, టీవీలతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా భారత మార్కెట్లలోకి స్మార్ట్‌టీవీలను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ చైనాలో స్మార్ట్‌టీవీలను రిలీజ్ చేసింది. ఒప్పో కే9 సిరీస్‌తో భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ1లో విడుదల చేయనున్నారు. ఇక ఈ స్మార్ట్ టీవీలను ఒప్పో మీడియాటెక్ ప్రాసెసర్‌తో తీసుకురానుంది. ఈ టీవీల ధర విషయానికొస్తే.. 43 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 22,800, 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 32,000, 65 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర రూ. 45,600కి అందుబాటులో ఉండే అవకాశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: IND vs NZ: తొలి రోజు ఆట ముగిసే సమయానికి 258 పరుగులు చేసిన భారత్.. రాణించిన గిల్, శ్రేయాస్, జడేజా..
DCCB Recruitment: కాకినాడ డీసీసీబీ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..