Car-Bike Tyre Care: మీ వాహనం టైర్లు పదేపదే అగిరిపోతున్నాయా..? ఈ చిట్కాలను పాటించండి

|

Oct 23, 2022 | 11:42 AM

టైర్లను ఎలా చూసుకోవాలి: వాహనాలకు టైర్లు ఎంతో ముఖ్యం. వాహనం బయటకు తీయాలంటే ఎన్నో్ జాగ్రత్తలు తీసుకోవాలి. టైర్లలో గాలి సరిగ్గా ఉందా లేదా ముందుగా చూసుకోవాలి..

Car-Bike Tyre Care: మీ వాహనం టైర్లు పదేపదే అగిరిపోతున్నాయా..? ఈ చిట్కాలను పాటించండి
Car Tyre
Follow us on

టైర్లను ఎలా చూసుకోవాలి: వాహనాలకు టైర్లు ఎంతో ముఖ్యం. వాహనం బయటకు తీయాలంటే ఎన్నో్ జాగ్రత్తలు తీసుకోవాలి. టైర్లలో గాలి సరిగ్గా ఉందా లేదా ముందుగా చూసుకోవాలి. టైర్లలో సరైన గాలి లేకుంటే త్వరగా పాడవుతాయి. టైర్ ఫెయిల్యూర్‌లో కంపెనీ కంటే మన నిర్లక్ష్యమే ఎక్కువ. అయితే టైర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరాల తరబడి పాడవకుండా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత టైర్లను మారుస్తుంటారు. ఇలాంటి సమయంలో టైర్ల పరిమాణంలో తేడా వచ్చి కొన్ని చిన్నవి, పెద్దవిగా ఉంటాయి. ఇలా టైర్లు ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల మైలేజీ తక్కువగా వస్తుంటుంది. దీని వల్ల మీరు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది.

గాలి ఒత్తిడికి ప్రత్యేక శ్రద్ధ వహించండి

మీ టైర్ ఎంత వరకు ఉంటుంది అనేది దానిలో నింపిన గాలి పీడనంపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. టైర్‌లో గాలి నింపకపోతే, దానిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. త్వరగా అరిగిపోతుంది. అందుకే మీరు ప్రతి 10-12 రోజులకు మీ బైక్ గానీ, కారు గానీ టైర్ల గాలి ఒత్తిడిని తనిఖీ చేస్తూ ఉండాలి.

టైర్లను మారుస్తూ ఉండండి

వాహనం టైర్లను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది. టైర్లు ఎక్కువ అగిరిపోయిన సమయంలో కొత్త కార్లను మారుస్తూ ఉండాలి. సాధారణంగా బైక్-కారు ముందు టైర్ల కంటే వెనుక టైర్లు ఎక్కువగా మారుస్తుంటారు. టైర్లను కూడా ఏవి పడితే అవి మార్చకూడదు. మార్కెట్లో మంచి బ్రాండ్‌ కలిగివున్న టైర్లను మాత్రమే వేయాలి. అలాగే వాహనం స్పీడ్‌గా తీసుకెళ్తూ ఒక్కసారిగా స్పీడ్‌ తగ్గించకూడదు. మెల్లమెల్లగా తగ్గిస్తూండాలి. ఒక ఒక్కసారి స్పీడ్‌ వెళ్లి తగ్గిస్తూ టైర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల టైర్లు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే రోడ్డుపై గుంతలున్న చోట స్పీడ్‌గా వెళ్లకూడదు. కాస్త జాగ్రత్తగా వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

టైర్ సీలెంట్ ఉపయోగించండి

దారిలో టైర్ పంక్చర్ అయ్యే బదులు టైర్ సీలెంట్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల పంక్చర్ వెంటనే నయమవుతుంది. గాలి ఒత్తిడి తగ్గదు. మీరు సుదీర్ఘ ప్రయాణంలో వెళుతున్నట్లయితే టైర్ సీలెంట్ అనేది మంచి ఉపయోగకరంగా ఉంటుంది.

కారు టైరు ఎప్పుడు మార్చాలి?

సాధారణంగా బైక్-కార్ టైర్ 40 వేల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా మార్చాల్సి ఉంటుంది. అలాగే కారు, బైక్‌ల టైర్లను బట్టి మనం కొత్తవి మార్చాలా వద్దా అనే అంచనా వేయవచ్చు. బైక్‌లపై వెనుకల ఎక్కువ మంది కూర్చుంటూ పదేపదే ప్రయాణిస్తే టైర్లు త్వరగా మార్చాల్సి వస్తుంటుంది. ఏదీ ఏమైనా కారు, బైక్‌ టైర్లలో గాలి సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే టైర్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి