
ఫోన్ హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా హ్యాకర్స్ కొత్త కొత్త విధానాల్లో మన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేయడం ఒక పద్ధతి. కానీ ఇది చాలా కష్టం కూడా.. ఇక మీ ఫోన్లో బగ్ పెట్టడం ఇంకో పద్ధతి. ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం. అన్నిటికంటే ఈజీ మెథడ్ మీ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకోవడం. చాలా తేలికగా హ్యాకర్లు దీంతో లక్షలు కొల్లగొడుతున్నారు. సామాన్యులకు అస్సలు అర్థం కాని ఈ స్కాం సైబర్ క్రిమినల్స్‌కు ఈజీ మనీగా మారిపోయింది.
సింపుల్‌గా మీకు కొరియర్ వచ్చిందని లేదా మీకోసం గిఫ్ట్ రెడీగా ఉందని, మీ అమెజాన్ పార్సిల్ కోసం కొరియర్ బాయ్‌కి కాల్ చేయండి అని, స్విగ్గి డెలివరీ బాయ్‌కి అడ్రస్ దొరకడం లేదు అతని నెంబర్‌కి కాల్ చేయండి అని.. ఇలా రకరకాల పేర్లతో మీకు కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. నిజమే అనుకొని మనం కూడా అంతే ఈజీగా వాళ్లు పంపించిన నెంబర్‌కి కాల్ చేస్తాం. సైబర్ క్రిమినల్స్ పంపించిన మెసేజ్‌లోని నెంబర్‌పై క్లిక్ చేసి కాల్ చేస్తుంటాం. నిజానికి అది కొరియర్, డెలివరీ బాయ్ ఫోన్ నెంబర్ కాదు మన ఫోన్ నెంబర్ నుంచి వాడి ఫోన్ నెంబర్‌కి మన కాల్స్‌ని మెసేజెస్‌ని ఫార్వర్డ్ చేసుకునే టెలికాం క్యారియర్ నెంబర్. ఒక్కసారి క్లిక్ చేశామా ఇక మన ఓటీపీలు మన కాల్స్ అన్ని సైబర్ క్రిమినల్ ఫోన్ నెంబర్ కి వెళ్ళిపోతాయి.
మన వాట్సప్ కూడా ఇదే పద్ధతిలో ఈజీగా హ్యాక్ చేస్తారు. అందుకే ఈ కోడ్ నెంబర్‌తో మీ ఫోన్‌ని చెక్ చేసుకోండి. మీ ఫోన్ హ్యాక్ అయింద లేదా రెండు సెకండ్లలో మీకు తెలిసిపోతుంది. మీ మొబైల్ డయల్‌లో *#21# డయల్ చేయండి. వెంటనే మీ స్క్రీన్‌పై కాల్స్ ఫార్వర్డ్, మెసేజెస్ ఫార్వర్డ్, వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజెస్ అన్ని డిసేబుల్డ్ అయి ఉండాలి. ఏదైనా ఎనేబుల్ అయివుందంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టుగా గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ కాల్స్ అన్ని స్కామర్స్‌కి వెళ్తున్నట్లే…
ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ##002# ఈ నెంబర్ను డయల్ చేయండి. మీ ఫోన్ నుంచి ఫార్వర్డ్ ఉన్న ఆప్షన్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి. అది కూడా కొన్ని సెకన్లలోనే. ఒకవేళ మీ వాట్సాప్ హ్యాక్ అయితే ఇదే పద్ధతిని పాటించి మళ్లీ వాట్సప్ లాగిన్ అవ్వండి. అప్పుడు మీ కొత్తగా ఓటీపీ మీ మొబైల్ కి వస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ తో 80 శాతం సైబర్ క్రైమ్‌ని ఆపేయొచ్చు.