TVS Apache RTR : టీవీఎస్ అపాచీపై బంపర్ ఆఫర్..!10,000 రూపాయలు తగ్గింపు.. ఇప్పుడు ధర ఎంతో తెలుసా..?

|

Jun 15, 2021 | 1:05 PM

TVS Apache RTR : మీరు ఉత్తమమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే పాపులర్ స్పోర్ట్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 200 ను రూ.10,000

TVS Apache RTR : టీవీఎస్ అపాచీపై బంపర్ ఆఫర్..!10,000 రూపాయలు తగ్గింపు.. ఇప్పుడు ధర ఎంతో తెలుసా..?
Tvs Apache Rtr
Follow us on

TVS Apache RTR : మీరు ఉత్తమమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే పాపులర్ స్పోర్ట్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 200 ను రూ.10,000 తగ్గింపుతో కొనవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌లో 5 శాతం వరకు లేదా గరిష్టంగా 5000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను టీవీఎస్ మోటార్స్ ఇస్తోంది. ఇవే కాకుండా ఫైనాన్స్‌ పథకం కింద రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నారు. అపాచీ ఆర్టిఆర్ 200 బైక్‌లో 197.75 సిసి సామర్థ్యం గల బిఎస్ 6 కంప్లైంట్ ఆయిల్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 20.54bhp బలమైన శక్తిని, 17.25Nm యొక్క టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. డబుల్- డిస్క్ స్ప్లిట్ ఫ్రేమ్ ఆధారంగా, ఈ బైక్ దాని బలమైన పనితీరుకు చాలా ప్రసిద్ది చెందింది. దాని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది.

అపాచీ ఆర్టీఆర్ 200 బైక్ లక్షణాలు
సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) , డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌లతో వచ్చే ఈ బైక్ మొత్తం నాలుగు వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా స్ప్లిట్ టైమ్ సీట్లు, గ్రాబ్ రైల్ హ్యాండిల్ దాని సైడ్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో ఇవ్వబడ్డాయి. దీనితో పాటు ఎల్‌ఈడీ లైట్లు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇచ్చారు. మొబైల్ కనెక్టివిటీ, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జిటిటి) వంటి ఫీచర్లు మెరుగ్గా ఉంటాయి.

అపాచీ ఆర్టీఆర్ 200 బైక్ ధర
ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఇవ్వబడింది. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే దాని ముందు భాగంలో 270 ఎంఎం సింగిల్ వేవ్ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. వెనుక చక్రంలో 240 ఎంఎం డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. ఈ బైక్ సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో వస్తుంది. ధర గురించి మాట్లాడుతూ.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4 వి ప్రారంభ ధర రూ .1.29 లక్షల నుంచి మొదలై రూ.1.34 లక్షల వరకు ఉంటుంది.

Viral‌ Video : గాల్లో వేలాడిన గుర్రం..! మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పుగా పరిణమించాయి.. వైరల్‌ వీడియో..

After Corona Vaccination : కరోనా టీకా వేసుకున్నాక శరీరం అయస్కాంతంగా మారుతుందా..! అస్సాంలో ఓ వ్యక్తి బాడీ చెంచాలు, నాణేలను ఆకర్షిస్తుంది..

Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?