
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.ఫైబర్ బ్యాండ్ సబ్ స్కైబర్లకు అందించే సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ ధరను భారీ గా తగ్గించింది. దాదాపు 50 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫారంలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ ప్యాక్ ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఓటీటీ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి..
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఓటీటీ ప్యాకేజీ ధర దాదాపు 50 శాతం తగ్గింపుతో లభిస్తుంది. గతంలో ఈ ప్యాకేజీ ధర రూ.99 ఉండేది. ఇప్పుడు కేవలం రూ.49కే అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాకేజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లయన్స్ గేట్ (Lionsgate),షెమరూమీ (ShemarooMe), హంగామా (Hungama), ఎపిక్ఆన్ (EpicON) తదితర ఓటీటీలలోని సినిమాలను చక్కగా చూడవచ్చు. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ కస్టమర్లందరూ ఈ ఓటీటీని కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్లాట్‌ఫారమ్‌లలో కొన్ని కంటెంట్‌కి మరింత విస్తృతమైన యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. మీరు హెచ్ బీఓ కంటెంట్ కావాలనుకుంటే జియో సినిమా ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్‌కు యాక్సెస్ కావాలనుకునే ఫైబర్ కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ వెబ్‌సైట్‌కి వెళ్లి తమకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం తమకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలను చూడటం ప్రారంభించవచ్చు. సబ్‌స్క్రిప్షన్ రుసుము కస్టమర్ బ్రాడ్‌బ్యాండ్ బిల్లుకు కలుపుతారు. ప్రత్యేకంగా ఛార్జ్ చేయరు.
ఇంటర్నెట్ ఆధారంగా సినిమాలు, టీవీ షోలు, ఇతర కార్యక్రమాలను అందించే దానిని ఓటీటీ అంటారు. వీటిలో సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు, సెలబ్రిటీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మనం దేశంలో కొన్ని కొత్త సినిమాలు ఈ ఓటీటీలలోనే విడుదల చేస్తున్నారు. కరోనా సమయం నుంచి వీటికి ఆదరణ బాగా పెరిగింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..