BSNL: ఫ్యాన్సీ నెంబర్‌ కావాలా..? ఆన్‌లైన్‌ వేలంలో సొంతం చేసుకోవచ్చు..

|

Nov 13, 2023 | 9:50 PM

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ల కోసం ఇలాంటి అవకాశాన్ని తీసుకొచ్చింది. మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ వేలం పాట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండడం విశేషం. ఆన్‌లైన్‌లో పాల్గొని ఫ్‌యాన్సీ నెంబర్‌తో కూడిన సిమ్‌ కార్డులను సొంతం చేసుకోవచ్చు. నవంబర్‌ 11 నుంచి ఈ ప్రీమియం నెంబర్ల వేలాన్ని నిర్వహిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ వేలంపాట నవంబర్‌ 20వ తేదీ వరకు కొనసాగనుంది...

BSNL: ఫ్యాన్సీ నెంబర్‌ కావాలా..? ఆన్‌లైన్‌ వేలంలో సొంతం చేసుకోవచ్చు..
Fancy Numbers
Follow us on

ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాహనాల నెంబర్‌ మొదలు మొబైల్ నెంబర్‌ వరకు అన్నీ ఫ్యాన్సీగా ఉండాలని కోరుకునే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే సాధారణంగా వాహనాల నెంబర్లను వేలం పాటలో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే మొబైల్‌ నెంబర్లను కూడా వేలంలో పాల్గొని పొందొచ్చనే విషయం మీకు తెలుసా.?

అవును ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ల కోసం ఇలాంటి అవకాశాన్ని తీసుకొచ్చింది. మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ వేలం పాట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండడం విశేషం. ఆన్‌లైన్‌లో పాల్గొని ఫ్‌యాన్సీ నెంబర్‌తో కూడిన సిమ్‌ కార్డులను సొంతం చేసుకోవచ్చు. నవంబర్‌ 11 నుంచి ఈ ప్రీమియం నెంబర్ల వేలాన్ని నిర్వహిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ వేలంపాట నవంబర్‌ 20వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ నెంబర్లు ప్రస్తుతం.. పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో వేలం వేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో రోమింగ్ విధానం లేకపోవడంతో ఎక్కడి సిమ్‌ను ఎక్కడైనా ఉపయోగించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

ఈ వేలంలో అందుబాటులో ఉన్న నెంబర్లు, ధర వివరాలు..

8300000022 నెంబర్‌ రూ. 25 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక 8300001234 మొబైల్ నెంబర్‌ రూ. 10 వేల నుంచి ప్రారంభమవుతుంది. 8300012345 మొబైల్‌ నెంబర్‌ రూ. 10 వేల నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8300010001 మొబైల్ నెంబర్ రూ. 8 వేల నుంచి ప్రారంభంకానుంది. దీంతో పాటు 8300020002, 8300030003 రెండు నెంబర్లు రూ. 8 వేల నుంచి వేలం ప్రారంభం కానుంది.

ఇక రూ. 5 వేల నుంచి ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల వేలంపాట అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా.. 8300081000, 8300082000, 8300083000 మొబైల్‌ నెంబర్లను రూ. 5 వేల వేలంపాట నుంచి ప్రారంభం అవుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొబైల్ నెంబర్‌ ఆక్షన్‌ విభాగం ద్వారా మొబైల్‌ నెంబర్‌ వేలంపాటను ఆన్‌లైన్‌లో పాల్గొనవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..