BSNL: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్‌ల గడువు పొడిగింపు..

|

Nov 20, 2022 | 8:40 PM

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే మూడు ఆకర్షణీయమైన బ్రాండ్‍బ్యాండ్ ప్లాన్‍లు అందుబాటులో ఉండగా.. వాటి గడువును బీఎస్ఎన్ఎల్ పొడిగించింది. స్వాతంత్య్ర దినోత్సవం..

BSNL: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఆ ప్లాన్‌ల గడువు పొడిగింపు..
Bsnl
Follow us on

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే మూడు ఆకర్షణీయమైన బ్రాండ్‍బ్యాండ్ ప్లాన్‍లు అందుబాటులో ఉండగా.. వాటి గడువును బీఎస్ఎన్ఎల్ పొడిగించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్లాన్‍లను మరింత కాలం ఇవ్వనుంది. రెండోసారి ఈ భారత్ ఫైబర్ బ్రాండ్‍బ్యాండ్ ఫ్రీడమ్ ప్లాన్‍ల గడువును పెంచింది. నవంబర్ 15వ తేదీ వరకు ఈ మూడు ప్లాన్‍లను ఇస్తామని ముందుగా చెప్పిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో నెల రోజులు ఈ ప్లాన్‌ను పొడిగించింది. రూ.275 ధరతో రెండు ప్లాన్స్ ఉండగా.. మరొకటి రూ.775 ప్లాన్. ఈ ప్లాన్‍లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి.. ఆ ప్లాన్స్ ప్రయోజనాలు తెలుసుకుందాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టులో తీసుకొచ్చిన రూ.275, రూ.775 భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను డిసెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍తో పాటు మరిన్ని సర్కిళ్లలో డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ ప్లాన్‍లు ఉంటాయని వెబ్‍సైట్‍లో పేర్కొంది. ఈ బ్రాండ్‍బ్యాండ్ ఆఫర్ ప్లాన్స్ కావాలనుకున్న వారు డిసెంబర్ 14వ తేదీలోపు రీచార్జ్ చేసుకోవచ్చు.

ఫ్రీడమ్ ఆఫర్స్ కింద రూ.275 ధరతో రెండు బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‍లను ఎంపిక చేసుకుంటే 75 రోజుల వ్యాలిడిటీతో 3,300జీబీ డేటా లభిస్తుంది. రెండు ప్లాన్‍లతో ఇవే బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఓ ప్లాన్‍తో 60 Mbps ఇంటర్నెట్ వేగం, మరో ప్లాన్‍తో 30 Mbps వేగం లభిస్తుంది. వినియోగదారులు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే భారత్ ఫైబర్ వాడుతున్న వారు కూడా ఆఫర్ ప్లాన్‍లను తీసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.775 ఫ్రీడమ్ ప్లాన్‍ను ఎంపిక చేసుకుంటే 75 రోజుల కాలపరిమితి ఉంటుంది. 150 ఎంబిపిఎస్‌ వేగంతో 2000జీబీ డేటా లభిస్తుంది. డిస్నీ+ హాట్‍స్టార్, సోనీ లివ్, జీ5 వూట్, యప్ టీవీ, లయన్స్ గేట్, షెమారో, హంగామా ఓటీటీల సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..