Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Invention: ప్రమాదంలో చెవి..ముక్కు దెబ్బతిన్నాయా? మీకో గుడ్‌న్యూస్!  త్రీడీ ప్రింట్‌తో ఒరిజినల్ రెడీ చేసేస్తారు.. 

ప్రమాదంలో శరీరంలో ఏదైనా భాగాలు దెబ్బతింటే వాటిని తిరిగి అమర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దాదాపుగా ఆ అవయవాలు లేకుండా మిగిలిన జీవితాన్ని బాధితుడు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది.

New Invention: ప్రమాదంలో చెవి..ముక్కు దెబ్బతిన్నాయా? మీకో గుడ్‌న్యూస్!  త్రీడీ ప్రింట్‌తో ఒరిజినల్ రెడీ చేసేస్తారు.. 
New Invention
Follow us
KVD Varma

|

Updated on: Jul 26, 2021 | 10:53 AM

New Invention: ప్రమాదంలో శరీరంలో ఏదైనా భాగాలు దెబ్బతింటే వాటిని తిరిగి అమర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దాదాపుగా ఆ అవయవాలు లేకుండా మిగిలిన జీవితాన్ని బాధితుడు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ప్రస్తుతం టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా చాలా మార్పులు వస్తున్నాయి. శరీరంలో కొన్ని భాగాలను ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేయడం ఇంతవరకూ జరుగుతూ వస్తోంది. ఇప్పుడు కొన్ని భాగాలు 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు. ఇంగ్లాండ్‌లోని శాస్త్రవేత్తలు 3 డి ప్రింటింగ్ ద్వారా  కృత్రిమ చెవులు-ముక్కును సృష్టించారు. పుట్టినప్పటి నుండి ముఖం మీద చెవులు లేదా ముక్కు లేని పిల్లలు, పెద్దలలో ఈ అవయవాలను అమర్చవచ్చు. ఈ కృత్రిమ అవయవాలు రోగి కణాల నుండి తయారు చేస్తారు.  దీనిని వేల్స్‌లోని స్వాన్సీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేశారు. శాస్త్రవేత్తలు, చెవులు, ముక్కుతో పాటు, ముఖం లోని ఇతర భాగాలను కూడా 3 డి ప్రింటింగ్ ద్వారా తయారు చేయవచ్చు అంటున్నారు.  ఈ టెక్నిక్ సహాయంతో, ముఖం మీద కాలిన గాయాలు, క్యాన్సర్ , ఇతర గాయాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయవచ్చు.

రోగి మూల కణాల నుండి అవయవాలు..

స్వాన్సీ విశ్వవిద్యాలయం అటువంటి వారికి సహాయపడటానికి స్కార్-ఫ్రీ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ముఖం లోని  కొంత భాగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులను ఈ ప్రయోగం క్లినికల్ ట్రయల్స్‌లో చేర్చారు. అలాంటి రోగులు, ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రొస్థెటిక్ వాడుతున్నారు. కానీ, వారు దానిని శరీరంలో ఒక భాగంగా అనుభూతి చెందలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, స్కార్ ఫౌండేషన్ అదే రోగుల నుండి మూలకణాల సహాయంతో కృత్రిమ ముక్కు,  చెవులను అభివృద్ధి చేస్తోంది, తద్వారా వాటిని అదే రోగులలో అమర్చవచ్చు.

మృదులాస్థి తీసుకోరు..

శాస్త్రవేత్తలు, ప్రొస్థెసిస్ సిద్ధం చేయడానికి రోగి శరీరం నుండి మృదులాస్థి తీసుకోరు. ఎందుకంటే అలా చేయడం ద్వారా రోగులకు బాధాకరమైన శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత, దాని గుర్తు శరీరంపై వస్తుంది. అందువల్ల రోగుల నుండి మూల కణాలను ఈ అవయవాల రోపకల్పనకు తీసుకుంటారు. ఈ మూల కణాలు, మొక్కల నుండి పొందిన నానోసెల్లూలోజ్ నుండి బయోఇంక్‌లు తయారవుతాయి. ఈ బయోఇంక్, 3 డి ప్రింటర్, ఆధునిక  సాఫ్ట్‌వేర్‌ల  సహాయంతో  ప్రొస్థెసిస్ తయారవుతుంది.

బయోఇంక్ ఎంత సురక్షితం..

ప్రొస్థెసెస్ తయారీకి ఉపయోగించే బయోఇంక్ సురక్షితం అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది విషపూరితం కాదు. వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయదు. ప్రొస్థెసెస్ అమర్చడానికి కొత్త పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని  ప్రమాదంలో తీవ్ర కాలిన గాయాలకు గురైన రిటైర్డ్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్ సైమన్ వెస్టన్ చెప్పారు. ఈ పద్ధతిలో, శరీరం లోని ఏ భాగం నుండి చర్మం ఉపయోగించరు. అదేవిధంగా రోగి ఏ బాధాకరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

Also Read: Vaccination: వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి కరోనా వ్యాప్తి తక్కువే.. పరిశోధనల్లో వెల్లడి!

LG Puricare Mask: ఇది మాస్కు మాత్రమే కాదు, అంతకు మించి.. బిల్ట్‌ ఇన్‌ మైక్‌, స్పీకర్‌ మాస్క్‌ తీసుకురానున్న ఎల్‌జీ.