Flower don’t die: వికసించిన పువ్వు ఎల్లకాలం అలానే.. అదే అందంతో ఉంటే..! ఇలా చేస్తే సరి.!

|

Jul 30, 2021 | 9:43 PM

పువ్వు అనేది అందానికి సంకేతం - దయ యొక్క చిహ్నం. ఒక పువ్వు నుంచి వచ్చే భావాలు.... సంతోషం, ప్రశాంతత. పువ్వులు అందం కేవలం పువ్వు ఒడిలిపోకుండా ఉన్నంతసేపే ఉంటుంది..

Flower dont die: వికసించిన పువ్వు ఎల్లకాలం అలానే.. అదే అందంతో ఉంటే..! ఇలా చేస్తే సరి.!
Flower
Follow us on

Blooming Flower don’t die: పువ్వు అనేది అందానికి సంకేతం – దయ యొక్క చిహ్నం. ఒక పువ్వు నుంచి వచ్చే భావాలు…. సంతోషం, ప్రశాంతత. పువ్వులు అందం కేవలం పువ్వు ఒడిలిపోకుండా ఉన్నంతసేపే ఉంటుంది. ఒక అందమైన పువ్వులు చూసినప్పుడు మనం మన భావోద్వేగాలను వాటితో పంచుకుంటాము. కానీ ఇది కేవలం కొన్ని గంటలు లేదా రోజులు మాత్రమే అది కూడా ఎండిపోకుండా ఉన్నంతవరకే. అదే పువ్వు జీవితం మొత్తం అలానే అదే అందంతో ఉంటే ఎంత బాగుంటుందో….! హైదరాబాద్లోని ఒక ఫ్లవర్ ప్రెజర్వేషన్ సైంటిస్ట్, పువ్వులను అడే అందం తో చాలా కాలం పాటు ఉండేలా ఉంచడానికి పని చేస్తోంది. అసలు ఆమె ఎవరు? ఒక పువ్వుని అంతకాలం ఎండిపోకుండా ఎలా ఉంచుతారు?

హైదరాబాద్లో ఉంటున్న మహాలక్ష్మి వేణుగోపాల్ రెడ్డి అనే రిటైర్డ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భారతదేశంలో మొట్టమొదటి సారి floral preservation through freeze-drying technology అనే పేటెంట్ పొందారు. పువ్వులను వాడిపోకుండా ఆ జ్ఞాపకాలను జీవితం మొత్తం ఉంచేలా ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకేనేమో తనను ఫ్లవర్ ప్రెజర్వేషన్ సైంటిస్ట్ అంటారు.

చాలామంది బయటకు వెళ్ళినప్పుడు వాళ్లకు నచ్చిన ఫ్లవర్స్‌ని తెచ్చుకునే ఇంట్లో చాలా రోజులు పెట్టుకుంటారు. అలానే ప్లాస్టిక్ ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్, లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాంటివి ఇంట్లో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అదే ఒక నిజమైన పువ్వు జీవితం మొత్తం అలా ఎండిపోకుండా ఉండాలని, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎండిపోకుండా ఆ జ్ఞాపకాలు జీవితం మొత్తం ఉండాలని ఈ ఫ్రిజ్ డ్రయింగ్ టెక్నాలజీ‌ని ఉపయోగిస్తారు.

ఎవరైనా బొకే ఇచ్చినా లేదా అరుదైన పువ్వును గిఫ్ట్‌గా ఇచ్చిన, వాటిని ఈ మాకిస్తే జీవితం మొత్తం అందాన్ని పోగొట్టకుండా చేస్తుంది…. దీనికంటూ ఒక సపరేట్ మెషినరీ ఇంకా ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒక్క పువ్వు పొదిలి పోకుండా చెయ్యడానికి 15 రోజులు ప్రాసెస్ పడుతుంది. ముందుగా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి పువ్వులకు అందం పోకుండా చేస్తుంది. ఆ తరువాత ఫ్రీ ప్రాసెస్ చేసి కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ చేసి డ్రై చేస్తారు దీనివల్ల పువ్వుకి ఉన్న ఆనందం అలానే ఉంటుంది ఆ తర్వాత ఒక క్లోజ్డ్ కంటైనర్ లో పెట్టి ప్యాక్ చేస్తారు.

చాలా మంది యూత్ వాళ్లకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలా ఈ పువ్వులను గిఫ్ట్ గా ఎదుటి వాళ్ల ఫీలింగ్స్.. జీవితం మొత్తం పంచుకుంటారు. ఫ్లవర్స్ ఒక్కటే కాకుండా ఎవరైనా బొకే ఇచ్చిన, లేదా పెళ్ళిళ్ళకి వాడిన దండలు ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను ఈవిడ ఆ పువ్వుల లో ఈల జీవితం మొత్తం ఉంచేలా చేస్తారు.

విధయ్, టీవీ9 ప్రతినిధి

Read also:  Kondapalli: ‘కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారు’