Solar Storm: సమస్త మానవాళి ఉనికికి మూల కారణం సూర్యుడు. అలాంటి సూర్యుడిపై ఎలాంటి వాతావరణ మార్పులు జరిగిన అది మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకునే సూర్య గ్రహంపై జరిగే మార్పులను శాస్ర్తవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఇక సూర్యుడిపై సౌర తుపానులు సర్వసాధారణంగా చోటు చేసుకుంటాయి. అయితే ఇవేవీ ఇప్పటి వరకు భూమిపై ప్రభావాన్ని పెద్దగా చూపలేదు. కానీ తాజాగా ఏర్పడ్డ ఓ భారీ సౌర తుపాను భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు… ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు. ఏకంగా గంటకు 16 లక్ష కిలో మీటర్ల వేగంతో ఈ సౌర తుపాను వస్తున్నట్లు శాస్ర్తవేత్తలు హెచ్చరించారు.
ఈ భారీ తుపాను సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమిపై సబ్-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావం జీపీఎస్ వ్యవస్థతో పాటు ఉపగ్రహాలపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీని వేగం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని, దీని కారణంగా భూమి వెలుపల వాతావరణంలో ఉన్న ఉపగ్రహాలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మొబైల్ సిగ్నల్, శాటిలైట్ టీవీలతో పాటు పవర్ గ్రిడ్‌లపై ప్రభావం పడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
Also Read: PAN Card: మీ వద్ద ఉన్న పాన్ కార్డు నిజమైనదా..? నకిలీదా..? సులభంగా తెలుసుకోండి ఇలా..?
Sirisha Bandla: నేడు రోదసిలోకి తెలుగమ్మాయి.. అరుదైన ఘనత సాధించనున్న బండ్ల శిరీష..