Amazon Sale: టెక్నో పోవా 5 ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. వివరాలు తెలుసుకుంటే కొనకుండా ఉండలేరు..

|

Aug 28, 2023 | 12:48 PM

ఇటీవల టెక్నో పోవా 5 సిరీస్ మార్కెట్లోకి వచ్చింది. దీనిలో రెండు మోడళ్లు ఉన్నాయి. టెక్నో పోవా 5, టెన్నో పోవా 5 ప్రో. గత వారంలో ఈరెండు ఫోన్లకు సంబంధించిన సేల్ అమెజాన్లో లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ కంపెనీ పలు కొత్త డిస్కౌంట్లను ఈ ఫోన్లపై ప్రకటించింది. అందులో పలు బ్యాంకు ఆఫర్లతో పాటు, ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆగస్టు 31 వరకూ ఈ ఆఫర్లు అమెజాన్ లో కొనసాగుతాయని టెక్నో పోవా కంపెనీ ప్రకటించింది.

Amazon Sale: టెక్నో పోవా 5 ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. వివరాలు తెలుసుకుంటే కొనకుండా ఉండలేరు..
Tecno Pova 5
Follow us on

నథింగ్ ఫోన్ లుక్ లో తక్కువ బడ్జెట్లో టెక్నో పోవా కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. ఇటీవల టెక్నో పోవా 5 సిరీస్ మార్కెట్లోకి వచ్చింది. దీనిలో రెండు మోడళ్లు ఉన్నాయి. టెక్నో పోవా 5, టెన్నో పోవా 5 ప్రో. గత వారంలో ఈరెండు ఫోన్లకు సంబంధించిన సేల్ అమెజాన్లో లో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ కంపెనీ పలు కొత్త డిస్కౌంట్లను ఈ ఫోన్లపై ప్రకటించింది. అందులో పలు బ్యాంకు ఆఫర్లతో పాటు, ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆగస్టు 31 వరకూ ఈ ఆఫర్లు అమెజాన్ లో కొనసాగుతాయని టెక్నో పోవా కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టెక్నో పోవా 5 సిరీస్ ఫోన్ల ధరలు ఇలా..

ఈ టెక్నో పోవా 5 ప్రో ఫోన్ గురించి చూస్తే దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 128జీబీ, 256జీబీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వేనీలా టెక్నో పోవా 5 ఫోన్ రూ.11,999కే లభిస్తోంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. యాంబర్ గోల్డ్, మెచా బ్లాక్, హర్రికేన్ బ్లూ రంగుల్లో లభ్యమవుతోంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్లో బ్యాంకు ఆఫర్లు ఇవి..

  • టెక్నో పోవా 5 సిరీస్ రెండు ఫోన్లపై పలు బ్యాంకులు డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ డీఎఫ్సీ డెబిట్ కార్డు దారులు ఆ కార్డుపై కొనుగోలు చేస్తే రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్- ఈఎంఐ కార్డుపై 10శాతం వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుపై రూ. 10శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో లేదు.
  • సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్- ఈఎంఐ పై 7.5శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకూ ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ఉంది. అలాగే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్-ఈఎంఐ(12 నెలల టెన్యూర్)తో మరో 12 నెలల తగ్గింపు లభిస్తుంది. అలాగే సిటీ బ్యాంక్ నాన్ ఈఎంఐ లావాదేవీపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ. 750 వరకూ తగ్గుతుంది.

టెక్నో పోవా 5 సిరీస్ ఫోన్ల వివరాలు ఇవి..

  • టెక్నో పోవా 5 ప్రో 5జీ ఫోన్లో ఆర్క్ ఇంటర్ ఫేస్ ఉంటుంది. ఇది ఆర్జీబీ ఎల్ఈడీ లైట్లతో వస్తుంది. వీటిని మ్యూజిక్, ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు, లో బ్యాటరీ అలర్ట్స్ వంటివి వాటి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ప్రో వేరియంట్ ఫోన్లలో 120 హెర్జ్ ఫుల్ హోచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. పోవా 5 ప్రో వెర్షన్ లో మాత్రం ముందు వైపు 12ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
  • బేస్ వేరియంట్ అయిన టెక్నో పోవా 5 లో డిజైన్ ప్రో మాదిరిగానే ఉంటుంది. హీలియో జీ99 ఎస్ఓసీ చిప్ సెట్ తో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..