Hidden Camera: జంటగా హోటల్ రూమ్‌లో స్టే చేస్తున్నారా? వీటిపై ఓ కన్నేయండి.. లేకుంటే అంతా రికార్డు చేసేస్తారు!

|

Jun 19, 2023 | 5:30 PM

ముఖ్యంగా హనీమూన్ కి వెళ్లిన జంటలు, లేదా విహారయాత్రలకు వెళ్తున్న జంటలే లక్ష్యంగా నేరగాళ్లు ఈ పనులు చేస్తున్నారు. హోటల్ గదులలో వారి ప్రైవేట్ క్షణాలను రహస్యంగా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Hidden Camera: జంటగా హోటల్ రూమ్‌లో స్టే చేస్తున్నారా? వీటిపై ఓ కన్నేయండి.. లేకుంటే అంతా రికార్డు చేసేస్తారు!
Hidden Camera
Follow us on

ఇటీవల కాలంలో హిడెన్ కెమెరాలతో వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీసి, ఆ తర్వాత వాటితో బెదిరింపులకు పాల్పడుతున్న నేరగాళ్ల సంఖ్య అధికమవుతోంది. పలు పోలీస్ స్టేషన్లలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హనీమూన్ కి వెళ్లిన జంటలు, లేదా విహారయాత్రలకు వెళ్తున్న జంటలే లక్ష్యంగా నేరగాళ్లు ఈ పనులు చేస్తున్నారు. హోటల్ గదులలో వారి ప్రైవేట్ క్షణాలను రహస్యంగా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొంతకాలం క్రితం దక్షిణ కొరియాలో 1000 మందికి పైగా వ్యక్తులు ఈ తరహా ఘటనలపై పోలీస్టేషన్లలో కేసు నమోదు చేశారు. మన దేశంలో కూడా ఇలాంటి కేసులు కొన్ని నమోదయ్యాయి. గత ఏడాది చివర్లో, యూపీలోని నోయిడాలో, హోటల్ గదిలో ఒక జంట ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి, ఫుటేజీని బయటపెడతామని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని టెహ్రీలో ఉన్న ఒక యువ జంట 2019లో తమ హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌లో కెమెరా దాచిపెట్టినట్లు కనుగొన్నారు. విహారయాత్రలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత (సన్నిహిత) క్షణాల చిత్రాలు, వీడియోలు వెబ్‌లో ప్రతిసారీ వస్తూ ఉంటాయి. అందుకే మనం ఎక్కడైనా తెలియని ప్రాంతంలో ఉండవలసి వస్తే మన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. పలు జాగ్రత్తలు పాటించడం కూడా ప్రధానం. అందుకే మీరు ఎప్పుడైన హోటల్ గదులలో బస చేసేటప్పుడు మీరు తనిఖీ చేయవలసిన ప్రధాన అంశాలను మీకు తెలియజేస్తున్నాం.

సీలింగ్ ఫ్యాన్‌ని తనిఖీ చేయండి.. ఫ్యాన్ మధ్యలో నుంచి వెలువడే ఎరుపు కాంతి కోసం ఫ్లాష్‌లైట్ లేదా టార్చ్‌ని వేసి చెక్ చేయండి. కెమెరా బ్లింక్ లైట్ లేదని నిర్ధారించుకోండి.

అసాధారణంగా ఉంచిన వస్తువులు.. గదిలో ఎక్కువ భాగం కనిపించే ప్రదేశాలను గుర్తించండి. ఇది కెమెరాను దాచిపెట్టే ప్రదేశం కావచ్చు. వీటిలో విచిత్రంగా ఉంచబడిన అద్దాలు లేదా అలంకరణ మొక్కలు మొదలైనవి ఉంటాయి. మీరు నిజంగా అక్కడ ఉండకూడదు లేదా అవసరం లేదు అని మీరు భావించే ఏదైనా వస్తువు. అనవసరమైన, అదనపు వైర్ కూడా దాచిన కెమెరాకు కనెక్ట్ చేయబడి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రికల్ ఉపకరణాలు.. చాలా దాచిన కెమెరా పరికరాలకు పవర్ సోర్స్ అవసరం. కాబట్టి మీరు అసాధారణమైన వైర్లు లేదా బ్లింక్ లైట్ల కోసం ఎలక్ట్రికల్ ఉపకరణాలను తనిఖీ చేయడం మర్చిపోవద్దు.

స్పీకర్లు లేదా స్పీకర్ మెష్‌లు.. దాచిన కెమెరాలు స్పీకర్‌లు, మ్యూజిక్ సిస్టమ్‌ల స్పీకర్ మెష్ లేదా టీవీలలో సులభంగా పెట్టేయవచ్చు. ఫ్లాష్‌లైట్ లేదా టార్చ్‌తో వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయండి. అప్పటి మీకు డౌట్ క్లియర్ కాకపోతే టవల్, హాంకీ లేదా టిష్యూ పేపర్‌తో వటిని కప్పేయండి.

హుక్స్ లేదా టవల్ హోల్డర్లు.. బాత్రూంలో హుక్స్ లేదా టవల్,హెయిర్ డ్రైయర్ హోల్డర్లను తనిఖీ చేయండి.

ఫైర్ అలారం, పొగ డిటెక్టర్లు.. ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్‌ను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి, ఎందుకంటే ఇవి కూడా హెడిన్ కెమెరాలు అమర్చే సాధారణ స్థలాలు.

హ్యాండిల్స్, తలుపులు.. హిడెన్ కెమెరాల కోసం తలుపులు, అల్మారాలు, సొరుగులు, కర్టెన్ రాడ్‌ల గుబ్బలు, హ్యాండిల్స్ ను తనిఖీ చేయండి.

లైట్లు ఆఫ్ చేసి ఇలా చేయండి.. మీరు కెమెరా ఎరుపు కాంతిని గుర్తించలేకపోతే, రాత్రి సమయంలో కెమెరా లెన్స్ ప్రతిబింబ ఉపరితలాన్ని గుర్తించగలరు. కాబట్టి అన్ని లైట్లను మూసివేసి, మెరిసే లేదా ప్రతిబింబించే కాంతి కోసం వెతకండి.

అద్దంపై వేలు-గోరు ట్రిక్.. మీరు మీ వేలు, దాని ప్రతిబింబం మధ్య అంతరాన్ని గుర్తించగలరో లేదో చూడటానికి మీ వేలి గోరును అద్దాలపై ఉంచండి. ప్రతిబింబం, మీ వేలికి మధ్య అంతరం లేకపోతే, అద్దానికి మరొక వైపున కెమెరా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..