Soundbars Under 5K: పండక్కి సౌండ్‌ బార్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో అదిరిపోయే డీల్స్‌పై ఓ లుక్కేయండి..

ఇదిలా ఉంటే కేవలం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్స్‌ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు సైతం భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన ప్రముఖ రిటైల్‌, ఈ కామర్స్‌ దిగ్గజం జియో మార్ట్ సైతం భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. పండగ సీజన్ నేపథ్యంలో లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌తో ఈ ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా సౌండ్‌ బార్స్‌పై దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు....

Soundbars Under 5K: పండక్కి సౌండ్‌ బార్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో అదిరిపోయే డీల్స్‌పై ఓ లుక్కేయండి..
Sound Bars

Updated on: Oct 08, 2023 | 2:25 PM

దేశంలో పండగ సీజన్‌ మొదలైంది. దసరా, దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఈ కామర్స్ సైట్స్ ఆఫర్ల వరద కురిపిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ 2023 పేరుతో ఫ్లిప్‌కార్ట్… బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ నుంచి మరెన్నో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ ఆఫర్లను అందిస్తున్నారు. వీటికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ సైతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే కేవలం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్స్‌ మాత్రమే కాకుండా ఇతర సంస్థలు సైతం భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన ప్రముఖ రిటైల్‌, ఈ కామర్స్‌ దిగ్గజం జియో మార్ట్ సైతం భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. పండగ సీజన్ నేపథ్యంలో లిమిటెడ్‌ టైమ్‌ డీల్‌తో ఈ ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా సౌండ్‌ బార్స్‌పై దాదాపు 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా రూ. 5 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ సౌండ్‌ బార్స్ ఏంటి.? వాటి ఫీచర్లు ఏంటి..? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

boAt Aavante Bar Rhythm 2.0 Soundbar..

భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బోట్‌ కంపెనీకి చెందిన ఈ సౌండ్‌ బార్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ బార్‌ అసలు ధర రూ. 7,999కాగా ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌తో రూ. 3,499కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఇక ఈ సౌండ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో పవర్‌ ఫుల్‌ 60 వాట్స్‌ ఆర్‌ఎమ్‌ఎస్ అందించారు. 2.0 ఛానల్‌ సౌండ్‌ బార్‌ దీని సొంతం. యూఎస్‌బీ పోర్ట్‌ ఆప్షన్‌తో తీసుకొచ్చిన ఈ సౌండ్‌లో బ్లూటూత్‌ వీ5.3 వెర్షన్‌ను అందించారు.

Zebronics Zeb-Juke Bar 3600…

జిబోన్రిక్‌ కంపెనీకి చెందిన ఈ సౌండ్‌ బార్‌ అసలు ధర రూ. 9,999కాగా ఏకంగా 57 శాతం డిస్కౌంట్‌తో రూ. 4299కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ సౌండ్ బార్‌ ఫీచర్ల విషయానికొస్తే దీనిని సింగిల్‌ వైర్‌లెస్‌గా తీసుకొచ్చారు. 2.0 ఛానెల్‌ సౌండ్‌బార్‌, ఫాబ్రిక్‌ ఫినిష్‌ ఈ సౌండ్‌ బార్‌ సొంతం. మంచి క్వాలిటీతో కూడిన సౌండ్‌ను అందించేందుకు గాను ఇందులో 6.35 సీఎమ్ x 4 పవర్ క్వాడ్‌ డ్రైవర్లను అందించారు. రిమోట్‌ కంట్రోల్‌తో దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌, యూఎస్‌బీ, ఆక్స్‌, ఆప్టికల్ ఇన్‌పుట్‌, హెచ్‌డీఎమ్‌ఏ వంటి కనెన్టివిటీ ఆప్షన్స్‌ను అందించారు.

boAt Aavante Bar 908..

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ సౌండ్ బార్‌.. boAt Aavante Bar 908 2.0 Channel Soundbar. ఈ సౌండ్ బార్‌ అసలు ధర రూ. 5,990కాగా ఏకంగా 66 శాతం డిస్కౌంట్‌తో జియో మార్ట్‌లో రూ. 1,999కే సొంతం చేసుకోవచచు. ఏడాది వారంటీతో వస్తున్న ఈ సౌండ్‌ బార్‌లో 30 వాట్ ఆర్‌ఎమ్‌ఎస్ బోట్‌ సిగ్నేచర్‌ సౌండ్‌ను అందించారు. 2.0 ఛానల్‌తో సినిమాటిక్‌ అనుభూతిని లభిస్తుంది. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఈ సౌండ్‌ బార్‌ 30 వాట్స్‌ అందిస్తుంది.

Realme RMV2002..

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రియల్‌మీ సైతం సౌండ్‌ బార్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. రియల్‌మీ కంపెనీకి చెందిన.. Realme RMV2002 ,2.1 Channel సౌండ్‌ బార్‌ అసలు ధర రూ. 8,999కాగా 50 శాతం డిస్కౌంట్‌తో రూ. 4,499కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. పలు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఈ సౌండ్‌ బార్‌లో 60 వాట్స్‌ ఫుల్ రేంజ్‌ స్పీకర్స్‌తో.. సినిమాటిక్‌ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. బ్లూటూత్‌ 5.0తో ఈ సౌండ్‌ బార్‌ పని చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..