Budget Phone Under 10000: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలోనే మంచి ఫోన్ కావాలా? ఏ ఫోన్ కొనాలా అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, మీకోసమే ఈ కీలక సమాచారం. మార్కెట్‌లో రకరకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ బ్రాండ్ల ఫోన్లలో వివిధ రేట్ల స్థాయిలో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే, చాలా మండి బడ్జెట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తుంటారు. ఎక్కువ స్టోరేజీ కెపాసిటీ, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ ఇలా అన్నీ ఆలోచిస్తుంటారు. అయితే, మార్కెట్‌లో అనేక కంపెనీల ఫోన్లు అందుబాటులో ఉండటం, అన్నీ ఒకే స్థాయి ధరలు ఉండటంతో ఏది కొనాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపకరిస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం.. భారత మార్కెట్‌లో రూ. 10 వేల లోపు ధర కలిగి, అద్భుతమైన ఫీచర్లు, బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల వివరాలను ఇక్కడ వివరిస్తున్నాము.
భారత్‌లో రూ.10 లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
పోకో M3..
బడ్జెట్ ఫోన్లలో పోకో ఎం3 టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు. అద్భుతమైన ఫీచర్లతో పాటు.. తక్కువ ఖర్చులో వచ్చేస్తుంది. 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్ 3 కలిగిన ఈ ఫోన్.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌తో శక్తినిస్తుంది. అంతేకాదు.. 4 GB RAM, 64 GB ఇంటర్నల్ సోరేజీ ఉంది. ఇంకొంచెం డబ్బు పెడితే.. 6 జీబీ ర్యామ్ వేరియంట్ మొబైల్ కూడా వస్తుంది. మూడు కెమెరాలు కలిగిన ఈ ఫోన్‌లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కాంబినేషన్‌తో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్‌తో ఉంది. అలాగే 6,000mAh బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 పై MIUI 12 తో రన్ అవుతుంది. Poco M3 ఫోన్ 4 GB RAM/ 64 GB వేరియంట్ ధర ఇండియాలో రూ. 9,999 గా ఉంది.
రెడ్‌మీ 9 ప్రైమ్/Poco M2..
Redmi 9 ప్రైమ్ బడ్జెట్ ఫోన్లలో బెటర్. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగిన ఫోన్లలో ఇది కూడా ఒకటి. 6.53-అంగుళాల స్క్రీన్‌తో గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ ప్రొటక్షన్ ఇస్తుంది. మీడియాటెక్ హీలియో G80 SoC ఉంది. 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీతో ఉంది. రెడ్‌మి 9 ప్రైమ్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది 13 MP ప్రధాన కెమెరాతో పాటు 8 MP అల్ట్రా-వైడ్ షూటర్, 5 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్‌ని కలిగి ఉంది. 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5,020 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 10 MIUI 12 తో రన్ అవుతుంది. రెడ్‌మీ 9 ప్రైమ్ 4 GB RAM/ 64 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. ఇక Poco M2 కూడా ఇంచుమించు ఇవే ఫీచర్లు కలిగి ఉంది. అయితే, రెడ్‌మీ కంటే వెయ్యి రూపాయలు తక్కువకే లభిస్తోంది. 4 GB RAM/ 64 GB స్టోరేజీ సామర్థ్యం కలిగిన Poco M2 ధర రూ. 8,999 లకు లభిస్తోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ F12/M12..
విభిన్న మోడల్ ఫోన్లు అయినప్పటికీ.. ఈ ఫోన్లలో ఫీచర్లన్నీ ఇంచుమించు సమానంగా ఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ M12, F12 దాదాపు సేమ్ ఫోన్లు. వాటి ధరలు కూడా ఒకేలా ఉన్నాయి. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. 6,000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సోపోర్ట్ ఇస్తోంది. నాలుగు కెమెరాలతో వచ్చిన ఈ ఫోన్‌లో.. 48 MP ప్రైమరీ కెమెరా, 5 MP అల్ట్రావైడ్ షూటర్, 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 MPతో ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ F12, M12 ఎక్సినోస్ 850 SoC పవర్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్లలో 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ F12/ M12 ధర 4 GB RAM/ 64 GB వేరియంట్లో రూ. 9,499 గా ఉంది.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1..
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ కూడా బడ్జెట్‌లో లభించే అద్భుతమైన ఫోన్. 6.67-అంగుళాల స్క్రీన్ 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫోన్. ఇది అత్యాధునిక పంచ్ హోల్ డిజైన్‌తో వచ్చింది. మీడియాటెక్ హీలియో G850 చిప్‌తో పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నర్ స్టోరేజీ కలిగి ఉంది. నాలుగు కెమెరాలు కలిగిన ఈ ఫోన్‌లో 48 MP ప్రైమరీ కెమెరా, 5 MP అల్ట్రావైడ్ స్నాపర్, 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 16 MP సెల్ఫీ కెమెరా. 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తోంది. ఆండ్రాయిడ్ 10 తో నడుస్తుంది. 4 GB RAM/ 64 GB ఇంటర్నరల్ స్టోరేజీ వేరియంట్ దర రూ. 9,499.
రియల్‌మీ సి 21 వై(Realme C21Y)..
బడ్జెట్ ఫోన్ల లిస్ట్‌లో Realme C21Y కూడా ఒకటి. ఇందులోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను డ్రాప్-నాచ్ దీని ప్రత్యేకత. ప్రాసెసింగ్ పవర్ పరంగా చూసుకుంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త యునిసోక్ T610 చిప్‌తో శక్తినిస్తుందిజ 4 GB RAM, 64 GB వేరియంట్‌లోనూ లభిస్తోంది. మైక్రో SD కార్డ్ సాయంతో స్టోరేజీని పెంచుకోవచ్చు. దీనికి ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది. 13 MP ప్రైమరీ కెమెరా, 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 5 MPతో ప్రైమరీ కెమెరా ఉంది. Realme C21Y 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇండియాలో దీని ధర రూ. 8,999 గా ఉంది.
Also read:
Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక లైవ్ ఆడియో రూమ్స్.. వీరికి మాత్రమే అనుమతి..!
Vaccination: మూడు రాష్ట్రాల ఎన్నికలు.. వంద కోట్ల టీకా డోసులు.. బీజేపీ విజయోత్సవ ప్రచార ప్రణాళికలు!