Best Power Banks: సూపర్ పవర్ పవర్‌బ్యాంక్స్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కెయ్యండి

|

Feb 26, 2023 | 4:10 PM

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పని చేయాలంటే కచ్చితంగా వాటికి చార్జింగ్ ఉండాలి. చార్జింగ్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటాం. కొంచెం మందికైతే ఏకంగా చార్జింగ్ ఫోబియా వస్తుంది అంటే ఆ వస్తువులు మన జీవితంలో ఏ మేరకు ప్రభావితం చూపుతున్నాయో? అర్థం చేసుకోవచ్చు.

Best Power Banks: సూపర్ పవర్ పవర్‌బ్యాంక్స్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కెయ్యండి
Power Banks
Follow us on

ప్రస్తుతం భారతదేశంలో సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు స్మార్ట్ వాచ్‌లు, బ్లూ టూత్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పతులను విరివిగా వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పని చేయాలంటే కచ్చితంగా వాటికి చార్జింగ్ ఉండాలి. చార్జింగ్ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటాం. కొంచెం మందికైతే ఏకంగా చార్జింగ్ ఫోబియా వస్తుంది అంటే ఆ వస్తువులు మన జీవితంలో ఏ మేరకు ప్రభావితం చూపుతున్నాయో? అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన గ్యాడ్జెట్స్‌కు చార్జింగ్ కావాలంటే కచ్చితంగా పవర్ బ్యాంక్ వాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా పవర్ బ్యాంక్స్ అందుబాటులో ఉంటున్నాయి. అందులో ది బెస్ట్ పవర్ బ్యాంక్స్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం. అవేంటో ఓ లుక్కెద్దాం.

అంబ్రేన్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్

ఈ పవర్ బ్యాంక్ 20 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ట్రిపుల్ అవుట్ పుట్ సామర్థ్యంతో టైప్ సి కేబుల్ ద్వారా చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఎల్ఐ పాలిమర్ బ్యాటరీ ద్వారా అత్యుత్తమ పనితీరును ఆశించవచ్చు. అలాగే ఇందులో ఉండే బహుళ పొర రక్షణ మీ డివైసెస్‌కు మంచి రక్షణ అందిస్తుంది. ప్రయాణ సమయంలో ఇది కచ్చితంగా వినియోగదారుడి డివైసెస్‌ చార్జింగ్ విషయంలో బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఐ ఫోన్ చార్జింగ్‌కు ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది.

ఎంఐ 3ఐ లిథియం పాలిమర్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్

ఈ పవర్ బ్యాంక్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. టైప్ సితో పాటు మైక్రో యూఎస్‌బీ వంటి బహుళ ఇన్‌పుట్‌లతో వస్తుంది. ట్రిపుల్ అవుట్‌పుట్ సపోర్ట్‌తో ఒకేసారి మూడు డివైస్‌లను చార్జ్ చేసుకునే అవకాశం ఉంది. 20000 ఎంఏహెచ్ పవర్‌తో లిథియంల పాలిమర్ బ్యాటరీ సపోర్ట్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్ ద్వారా మీ డివైసెస్ ఎక్కువ సార్లు చార్జ్ చేసుకోవచ్చు. తక్కువ చార్జింగ్ ఇబ్బందులతో పాటు ప్రయాణ సమయాల్లో ఈ పవర్ బ్యాంక్ ఉపయుక్తంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

యూఆర్‌బీఎన్ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్

ఈ పవర్ బ్యాంక్ ద్వారా 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో మన డివైసెస్‌ను చాలా స్పీడ్‌గా చార్జ్ చేసుకునే అవకాశం ఉంది. టైప్ సి సపోర్ట్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్ అధిక పనితీరు ఉండే పోర్టబుల్ పవర్ బ్యాంక్. టైప్ సి ఇన్‌పుట్ అవుట్ పుట్ సపోర్ట్‌తో వస్తుంది. దీని సొగసైన కాంపాక్ట్ డిజైన్ ప్రయాణ సమయంలో పట్టుకెళ్లడానికి వీలుగా ఉంటుంది. లిథియం పాలిమర్ బ్యాటరీ సపోర్ట్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్ ప్రయాణ సమయాలతో పాటు పవర్ కట్ వంటి కఠిన సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

22.5 డబ్ల్యూ ఫాస్ట్ చార్జ్ 20,000 ఎంఏహెచ్ ఆంబ్రేన్ పవర్ బ్యాంక్

22.5 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే ఆంబ్రేన్ పవర్ బ్యాంక్ బహుముఖ పోర్టబుల్ పవర్ చార్జర్‌గా నిలుస్తుంది. ట్రిపుల్ అవుట్ పుట్ టైప్ సి పిన్స్‌తో పాటు టైప్ సి ఇన్‌పుట్ ద్వారా చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే ఆకట్టుకునే చార్జింగ్ వేగం, పెద్ద కెపాసిటీ కారణంగా తమ డివైజ్లను పవర్‌లో ఉంచుకుందామనుకునేవారికి ఇదో గొప్ప ఎంపికగా మారుతుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..