WhatsApp: వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిందా.. ఇలా చేస్తే యాక్టివ్.. అందుబాటులోకి కొత్త ఫీచర్?

|

Jul 01, 2022 | 4:55 PM

యూజర్ల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ అయినట్లు మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే, కారణం ఏమైనప్పటికీ అలాంటి ఖాతాలను మరలా ఉపయోగించేందుకు ఓ అవకాశం రానుంది.

WhatsApp: వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిందా.. ఇలా చేస్తే యాక్టివ్.. అందుబాటులోకి కొత్త ఫీచర్?
Whatsapp
Follow us on

వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. బీటా వెర్షన్‌లో కంపెనీ ఇంకా అనేక ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో బ్యాన్ చేసిన ఖాతాలను మరోసారి పునరుద్ధించే ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చాలా సార్లు యూజర్ల వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కావడం జరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. అయితే, కారణం ఏమైనప్పటికీ, మీ ఖాతా బ్యాన్ అయితే, మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. కంపెనీ తాజా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ కనిపించింది.

WaBetaInfo కంపెనీ ఈ ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ కింద, వినియోగదారులు బ్యాన్ చేసిన ఖాతాను లేదా నిషేధించిన ఖాతాను పునరుద్ధరించేందుకు అభ్యర్థించవచ్చు. యాప్ నిబంధనలు, షరతులకు అనుగుణంగా లేని వేలాది ఖాతాలను WhatsApp ప్రతి నెలా నిషేధిస్తుందని తెలిసిందే. కొన్ని వారాల క్రితం, కంపెనీ 1.6 మిలియన్లకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించింది. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఖాతా బ్లాక్ అయిన వ్యక్తులకు రెండవ అవకాశం ఇవ్వాలని కంపెనీ కోరుకుంటోంది.

WhatsApp తాజా బీటా వెర్షన్ యాప్‌లో బ్లాక్ చేసిన ఖాతాలను ఉపసంహరించుకునే ఎంపికను చూపుతుంది. ఆ ఆఫ్షన్ ఎంచుకున్న తర్వాత, WhatsApp మద్దతు మీ ఖాతా సమాచారాన్ని సమీక్షిస్తుంది. మీరు సమీక్ష కోసం అభ్యర్థన చేసినప్పుడు, మీరు కొన్ని అదనపు వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఖాతా సమీక్షను సబ్మిట్ చేసిన తర్వాత, మీ ఖాతా పనిచేసే అవకాశం ఉంటుంది. పొరపాటున మీ అకౌంట్ బ్యాన్ అయిందని వాట్సాప్ భావిస్తే, మీ అకౌంట్ రద్దు చేయరు. అయితే మీ ఖాతా వాట్సాప్ నిబంధనలు, షరతులను ఉల్లంఘించినట్లు సంస్థ గుర్తిస్తే, మీరు మీ పాత ఖాతాను మళ్లీ ఉపయోగించలేరని మీరు గుర్తుంచుకోవాలి. దీని కోసం మీకు మూడవ అవకాశం ఇవ్వదు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి రానుందో ఇంకా వెల్లడించలేదు.