ఐఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈసారి కాస్త ఆలస్యం

| Edited By:

Jul 31, 2020 | 3:09 PM

సాధార‌ణంగా ప్రతి ఏడాది సెప్టెంబ‌ర్ నెలలో ప్ర‌ముఖ యాపిల్ సంస్థ త‌న కంపెనీ ఫోన్ల‌తో పాటు ఐఓఎస్ నూత‌న అప్‌డేట్లు, స‌రికొత్త డిజైన్లు, యాక్స‌స‌రీల‌ను ఆవిష్క‌రిస్తుంటుంది.

ఐఫోన్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈసారి కాస్త ఆలస్యం
Follow us on

Apple iPhone 12 update: సాధార‌ణంగా ప్రతి ఏడాది సెప్టెంబ‌ర్ నెలలో ప్ర‌ముఖ యాపిల్ సంస్థ త‌న కంపెనీ ఫోన్ల‌తో పాటు ఐఓఎస్ నూత‌న అప్‌డేట్లు, స‌రికొత్త డిజైన్లు, యాక్స‌స‌రీల‌ను ఆవిష్క‌రిస్తుంటుంది. ఈ క్ర‌మంలో ఈ సెప్టెంబ‌ర్‌లో ఐఫోన్ 12 మోడ‌ల్ విడుద‌ల అవుతుంద‌ని స్మార్ట్‌ఫోన్ ప్రియులు భావించారు. అయితే వీటి విడుద‌ల ఆల‌స్యం అవుతుంద‌ని యాపిల్ సంస్థ వెల్ల‌డించింది. ఈ ఐఫోన్ల‌ను ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. క్యూ3 2020 ఫలితాలను‌ విడుదల చేసిన సమయంలో యాపిల్ సంస్థ‌ దీనిపై క్లారిటీని ఇచ్చింది. కొత్త ఐఫోన్‌ల విడుదల ఈసారి కొన్ని వారాలు ఆలస్యం అవుతుందని కాన్ఫరెన్స్‌ కాల్‌లో యాపిల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ లూకా మాస్త్రీ తెలిపారు. ఇదిలా ఉంటే క్యూ 3 ఫ‌లితాల ప్ర‌కారం.. కంపెనీ త్రైమాసిక ఆదాయం 59.7 బిలియన్‌ డాలర్లుగా ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 11శాతం పెరిగిన‌ట్లు కంపెనీ ప్ర‌తినిథులు తెలిపారు.

Read This Story Also: ఆగష్టులో బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే