ఆగష్టులో బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే

రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగష్టు నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. ఈ నెలలో పలు పండుగలు కూడా ఉండటంతో.. అందులో పని చేసే వారికి అధిక సెలవులు కూడా ఉండనున్నాయి.

ఆగష్టులో బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 2:04 PM

Bank Holidays in August: రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగష్టు నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. ఈ నెలలో పలు పండుగలు కూడా ఉండటంతో.. అందులో పని చేసే వారికి అధిక సెలవులు కూడా ఉండనున్నాయి. వివరాల్లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో బక్రీదు సందర్భంగా 1వ తేదీన, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 11న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న, గణేష్‌ చతుర్థి సందర్భంగా ఈ నెల 22న బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు ఐదు ఆదివారాలు సెలవులుగా ఉండనున్నాయి. ఇక గణేష్‌ చతుర్ధి వలన నాలుగో శనివారం ఎలాగో హాలీడే ఉండగా.. రెండో శనివారం నేపథ్యంలో 8న కూడా బ్యాంకులు పనిచేయవు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో 10 రోజులు బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇదిలా ఉంటే రక్షా బంధన్‌ కారణంగా ఆగస్ట్‌ 3న అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, జైపూర్‌, కాన్పూర్‌, లక్నో తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు.

Read This Story Also: రియాకు వ్యతిరేకంగా చెప్పమంటున్నారు: సుశాంత్‌ ఫ్రెండ్‌