Vivo New Phone : వీవో నుంచి మరోకొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు.. సెల్ఫీ లవర్స్‌కు పండగే

|

Mar 24, 2023 | 1:00 PM

ముఖ్యంగా వివో కంపెనీ ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకోడానికి కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం వివో కంపెనీ వీ 27, వీ27 ప్రో ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు కర్వ్‌డ్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తాయి.

Vivo New Phone : వీవో నుంచి మరోకొత్త ఫోన్.. అదరగొడుతున్న ఫీచర్లు.. సెల్ఫీ లవర్స్‌కు పండగే
Vivo
Follow us on

భారత్‌లో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వివిధ మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ బ్రాండ్‌లో కొత్త మోడల్స్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఫోన్ అంటే కేవలం కాల్స్ వరకూ మాత్రమే అనుకునే రోజులు పోయాయి. ఫోన్స్‌లోనే అన్ని రకాలు సేవలు అందుబాటులోకి రావడంతో ఓ కొత్త ఫీచర్లతో ఫోన్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా వివో కంపెనీ ఎప్పటికప్పుడు మొబైల్ ప్రియులను ఆకట్టుకోడానికి కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం వివో కంపెనీ వీ 27, వీ27 ప్రో ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు కర్వ్‌డ్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తాయి. ముఖ్యంగా రంగును మార్చేలా బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారత్‌లో విక్రయిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, వివో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ ధరతో పాటు ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

వివో వీ 27 ధర, ఆఫర్లు

8 జీబీ+ 128 జీబీ వేరింయంట్‌తో వస్తున్న వీవో వీ 27 ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే 12 .జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా స్టోర్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఐసీఐసీఐ, కొటాక్ మహీంద్రా, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే అదనంగా రూ.3,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను పొందుతారు.

ఇవి కూడా చదవండి

వివో వీ 27 ఫీచర్లు ఇవే

  • 6.78 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ త్రీడీ  కర్వ్‌డ్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లే
  • స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్ కలర్ ఛేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ
  • ఆక్టాకోర్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ 
  • ఫన్ టచ్ ఓఎస్ 13 సపోర్ట్
  • 50 ఎంపీ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ 
  • 50 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ
  • టైప్ సీ పోర్ట్‌తో పాటు జీపీఎస్ కనెక్టవిటీ ఫీచర్లు

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం