Smartwatch: ప్రస్తుతం రకరకాల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీ బ్రాండ్ ఆంబ్రేన్ (Ambrane) తన సరికొత్త ఫిట్‌షాట్ స్పియర్ (FitShot Sphere) సిరీస్‌లో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.4,999గా నిర్ణయించింది. ఈ వాచ్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక సంవత్సరం పాటు వారంటీతో వస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 10 ఫీచర్స్ ఇవే..
- ఆంబ్రేన్ ఫిట్‌షాట్ జెస్ట్ స్మార్ట్ వాచ్ సైజు: 1.28 అంగుళాల డిస్‌ప్లే
- ఈ స్మార్ట్‌వాచ్ 24×7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు మద్దతు ఇస్తుంది.
- ఈ స్మార్ట్ వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, నిద్ర, హృదయ స్పందన రేటు వంటి పారామీటర్లను కొలిచే సదుపాయం ఉంటుంది. స్టెప్ ట్రాకర్ కూడా ఉంటుంది.
- ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనే వివరాలు చెబుతుంది.
- ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని రికార్డు చేయవచ్చు.
- ఈ స్మార్ట్ వాచ్‌లో బ్యాటరీ 270 mAh.
- ఈ వాచ్ ఐపీ67- రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
- యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో అంబ్రేన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్ హిస్టరీని ట్రాక్చేసుకోవచ్చు.
- ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.
- బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: